చంద్రబాబు నాయుడు 2014 లో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యిన తరువాత కొన్ని అనవసరమైన రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తారని చాలామంది భావించారు.  కానీ, బాబుగారు మాత్రం అలా కాకుండా.. ప్రతి విషయాన్ని రాజకీయం చేసుకుంటూ వచ్చారు.  నాలుగు సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉన్న బాబుగారు.. సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి అనగా బీజేపీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.  ఆ తరువాత మహాకూటమి పేరుతో బాబుగారు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు.  


అంతేకాదు, ప్రత్యేక హోదా అక్కర్లేదు.. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా చాలు అని చెప్పిన బాబు, చివరకు వచ్చే సరికి యూ టర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాల్సిందే అని పట్టుబట్టడంతో  అందరు షాక్ అయ్యారు.  ఇదే బాబుగారి ఓటమికి కారణం అయ్యింది.  ఇక ఉద్యోగాల కల్పన విషయంలో వెనుకబడ్డారు.  రాజధాని అమరావతిని 2018 వరకు మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పినా జరగలేదు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనగా హడావుగా పధకాలు ప్రారంభించి ప్రజలకు పంచిపెట్టారు.  


ఎన్నికలకు ముందు హడావుడి చేయడం ఎవరికీ నచ్చలేదు.  జనాల నాడిని అంచనా వేయడంలో బాబుగారు, తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలం అయ్యింది.  ఇది వైఎస్ జగన్ కు కలిసి వచ్చింది.  జగన్ ప్రభుత్వం విజయం సాధించడానికి ఇదొక కారణం అయ్యింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు.  ఇది పార్టీకి కలిసి వచ్చింది.  చిన్న చిన్న పొరపాట్లు జరిగితే జరిగి ఉండొచ్చు.  దీనిని ఇప్పుడు ప్రజలు పెద్దగా పట్టించుకోడం లేదు.  అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే జగన్ మంచి ముఖ్యమంత్రిగా ప్రజలు మెప్పు పొందారు.  


ఇక ఇదిలా ఉంటె, ఇసుక విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని బాబుగారు తప్పుపడుతున్నారు. జగన్ ఇసుక పాలసీ కారణంగా రాష్ట్రంలో నిర్మాణరంగం కుదేలైందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు.  రోజువారీ ఇసుక కూలీలకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు.  ప్రజలు జగన్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని, ప్రజలు తమ పాలనను కోరుకుంటున్నారని అన్నారు.  రాష్ట్రంలో బంగారమైనా దొరుకుతుందేమో గానీ.. ఇసుక దొరికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.  తాను ఎలాంటి తప్పు చేయలేదు.. భయపడను అన్నారు చంద్రబాబు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనపై 26 కేసులు వేసి ఏం సాధించారన్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు.  ప్రజావేదికను కూల్చివేసినపుడే వైకాపా ప్రభుత్వం పతనం ప్రారంభం అయ్యిందని బాబుగారు ఎద్దేవా చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: