టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో కూడా అరెస్ట్ అవుతారని వార్తలు వచ్చాయి. ఆయన నాలుగేళ్ళ పాటు టీడీపీతో దోస్తీ కట్టి చివరి ఏడాది మాత్రం అడ్డం తిరిగారు. అప్పట్లో ఆయన ప్రతీ రోజూ అనే మాట ఏంటంటే తనను బీజేపీ అరెస్ట్ చేయిస్తుందని, కానీ అలాంటిది ఏదీ లేకుండా చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. మరి చంద్రబాబు అరెస్ట్ ముచ్చట తీరుతోందా. ఆ విషయంలో ఎవరు తొందరపడుతున్నారు, ఎవరు తొందర పెడుతున్నారు.


బాబును అరెస్ట్ చేయాలని బీజేపీకి కూడా ఉంది. అయితే ఎక్కడ అది బెడిసికొట్టి జాతీయ స్థాయిలో ఇబ్బంది కలుగుతుందోననే నాడు మోడీ సర్కార్ తొందరపడలెదని అంటారు. ఇపుడు అన్ని రకాల ఎన్నికలు అయిపోయాయి. కేంద్రంలో మళ్ళీ మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఏపీలో ప్రభుత్వం జగన్ చేతిలో ఉంది. ఇపుడు బాబుని అరెస్ట్ చేయడం చాలా సులువు. ఎన్నికలు చూస్తే మరో నాలుగున్నరేళ్ళ వరకూ లేవు. అందువల్ల సానుభూతి.. వంకాయ వంటివి కూడా ఉండవు.


ఇదిలా ఉండగా బాబుని అరెస్ట్ చేయించాలన్న కోరిక ఎవరికి ఉందన్న మాటకు వస్తే జగన్ ఆ విషయంలో పట్టుదలగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నిన్నటి నుంచి ఢిల్లీలో ఉన్న జగన్ అదే పనిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ రోజు ఆయనకు షాతో భేటీ కుదరవచ్చు. ఇలా రోజుల తరబడి వేచి ఉండి మరీ షాతో సమావేశం కావడం వెనక జగన్ ఉద్దేశ్యం ఏంటన్నది కూడా చూడాలంటున్నారు.


ఏపీలో పోలవరం, అమరావతి వంటి భారీ ప్రాజెక్టులలో బాబు ఆయన అనుచరులతో కలసి అవినీతికి తెర తీశారన్న ఆధారాలు ఉన్నాయని జగన్ అమిత్ షాకు వివరించే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. ఆ విధంగా చెప్పి షాను ఒప్పించి బాబును అరెస్ట్ వరకూ తీసుకెళ్తారని అంటున్నారు. ఇప్పటివరకూ అవినీతి అని అంటున్నా కూడా జగన్ సర్కార్ ఎక్కడా టీడీపీ నేతలపై చర్యలు తీసుకోలేదని ఏకంగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పెద్ద మాట అనేశారు.


ఆ పెద్ద మాటలు పెద్దగానే జవాబు ఇవ్వాలని జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బాబుని అరేస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం అని కూడా భావిస్తున్నారుట. టీడీపీ తాజా ఎన్నికల్లో ఓడిపోయి కుదేలు అయిన వేళ బాబు అరెస్ట్ అయినా పెద్దగా పార్టీలోనూ ప్రభావం చూపదని, జనాల్లో కూడా ఇంపాక్ట్ వెళ్ళదని అనుకుంటున్నారుట. మరి బాబు అరెస్ట్ విషయం చర్చించుకేనా జగన్ ఢిల్లీ వెళ్ళింది అన్న చర్చ ఏపీలో వాడిగా వేడిగా సాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: