ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. వాతావరణ కేంద్రం ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర మీదుగా రేపు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. వాతావరణ శాఖ అధికారులు రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. 7 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. 
 
కొన్ని జిల్లాల్లో అతి భారీ నుండి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. కర్నూలు, కడప, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
వాతావరణ శాఖ అధికారులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అందువలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ అధికారులు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడిందని చెబుతున్నారు. 
 
తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాయలసీమలోని కర్నూలు జిల్లాలోని 43 మండలాలలో నిన్న వర్షం కురిసింది. కోవెలకుంట్లలో అత్యధికంగా 68.2 మిల్లీ మీటర్ల వర్షపాతం, ఆదోనిలో 14.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైతులు వర్షాలు విస్తారంగా పడుతూ ఉండటం వలన రబీ సాగు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: