దేశంలో ఆర్థిక మందగమనం ఎఫెక్టుతో దేశం మొత్తం అల్లాడుతోంది. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తో  అన్ని రంగాలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. ఆర్థిక మాంద్యం అన్ని రంగాల్లో ప్రభావం చూపడంతో  చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. కాగా  దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పరమైన బ్యాంకుల విలీనం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం . 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను 12 కుదించింది కేంద్రం. అయితే కేంద్రం నిర్ణయంపై ఇప్పటికే చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా బ్యాంకుల విలీనం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు అందరూ నేడు ఒక్కరోజు సమ్మెకు దిగనున్నారు. 

 

 

 

 

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, భారత్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కు చెందిన 3.50 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కుదించడం, బ్యాంకింగ్ సంస్కరణలు,  వినియోగదారులకు విధిస్తున్న అధిక జరిమానాలు సహా సేవ ఛార్జీలను వ్యతిరేకించెందుకే బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాయని  సంఘాల నేతలు తెలిపారు. దీంతో తమ  కార్యకలాపాలు ప్రభావితం అవుతాయి అని... సిండికేట్ బ్యాంక్,  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర,  బ్యాంక్ ఆఫ్ బరోడా,  బ్యాంక్ ఆఫ్ కామర్స్ తదితర బ్యాంకులు తెలిపారు.

 

 

 

 

 కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా వినియోగదారులకు ఇబ్బందులు తప్పవని బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు సమ్మెలో పాల్గొనడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కార్పొరేషన్ బ్యాంకులు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న బ్యాంకు 27 బ్యాంకులను  విలీనం చేసి 12 తగ్గించింది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: