తెలుగువారు గర్వించదగ్గ విషయయం ఏంటంటే, మన ‘టాలీవుడ్‘ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు సంపాదించుకుంది. అవునండీ, టాలీవుడ్ అనే పదాన్ని ఆక్స్ ఫర్డ్ లో చేర్చారు.. ఇది ఎంతో అద్భుతమైన విషయం ఎందుకంటే, మన టాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుందని అర్ధం. అంతే కాకుండా, అందులో టాలీవుడ్ తెలంగాణ లోని హైదరాబాద్ లో అధారితమై ఉందని ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఉండడం వల్ల కొత్తగా ఏర్పాటు అయిన మన తెలంగాణ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతుంది..


ఇకపోతే కాలిన్స్ ఇంగ్లీష్ డిక్షనరీలో టాలీవుడ్ ఎప్పుడో చోటు సంపాదించుకుంది, కానీ అందులో టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉందని పేర్కొన్నారు. ఆక్స్ ఫర్డ్ లో మాత్రం తెలంగాణలోని హైదరాబాద్ లో ఉందని పేర్కొన్నారు.. ఇదేకాకుండా భారత దేశంలో టాలీవుడ్ అని ఇంకొక చిత్ర పరిశ్రమ ఉందని మీకు తెలుసా? ఆక్స్ ఫర్డ్ ప్రకారం, బెంగాలి చిత్ర పరిశ్రమను కూడా టాలీవుడ్ అని అంటారట. కోల్‌కతాలోని టాలీగంగ్, టాలీవుడ్ తెలుగు చిత్రపరిశ్రమ అంటూ రెండు నిర్వచనాలు ఇచ్చింది ఓఈడి.. అంతేకాకుండా ఓఈడి ప్రతి నాలుగు నెలలకూ కొన్ని కొత్త పదాలు చేర్చుకుంటుంది.


వీటిలో ఎన్నో భారత దేశ పదాలు కూడా చేరాయి. అంబారీ, సత్తా, అంగామి, అంగ్రేజ్ వంటి పదాలు కూడా ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ లో ఉన్నాయి..ఇకపోతే ఈ ఏడాది అక్టోబర్‌లో కొత్తగా 203 పదాలను చేర్చారు. వీటిలో టాలీవుడ్ ఒకటి కావడం గమనార్హం. దీనికి తెలుగు సినీ పరిశ్రమ అని అర్థం ఇచ్చారు. మరో అర్థంగా బెంగాలీ సినీ పరిశ్రమ అని కూడా చేర్చారు. ఈసారి కొత్తగా చేర్చిన పదాల్లో ఫేక్‌ న్యూస్, సింపుల్స్, నోమోఫోబియా, జెడి, చిల్లాక్స్ తదితరాలు ఉన్నాయి. ఇంతేగాకుండా కొత్త పదాలతో పాటు పాత పదాలకు కొత్త అర్థాలను కూడా చేర్చారు. ఇలా ఈ దఫా మొత్తం 650 పైగా కొత్త ఎంట్రీలు ఆక్స్‌ఫర్డ్‌లో చేరాయి....


మరింత సమాచారం తెలుసుకోండి: