మరికొద్దిరోజుల్లో దీపావళి పండగ రాబోతుంది. ఈ మేరకు బాణసంచా దుకాణాల వ్యాపారస్తులు, టపాసుల తయారీకి కోసం కొందరు వ్యాపారులు భారీస్థాయిలో ముందస్తు సామాగ్రిని నిల్వ ఉంచుకున్నారు. అతి ప్రమాదకరమైన ఈ సామాగ్రిని అక్రమంగా నిల్వఉంచడంయే కాకుండా సామాగ్రికి ఎలాంటి రక్షణ లేకుండా ఉంచడంపై అధికారులు పోలీసులు, సంబంధిత అధికారులు వ్యాపారస్తులపై బాగా మంది పడుతున్నారు.


ఈ నేపథ్యంలో పలు చోట్ల పోలీసులు అధికారులు  దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణ ప్రధాన రహదారిలో బాణసంచా దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. దాడులలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఆదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమతులు లేకుండా ఉన్న రూ.3 లక్షల విలువైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.


చీమకుర్తి పట్టణ పోలీసు స్టేషన్ ఆవరణలో జరిగిన సమావేశంలో ఒంగోలు గ్రామీణ సీఐ సుబ్బారావు దీనికి సంబంధించిన వివరాలు వివరించడం జరిగింది. ఎస్సీ సూచనల మేరకు జూనియర్ ఇన్వెస్టిగేషన్ బృందం  చీమకుర్తిలో తనిఖీలు చేపట్టడం జరిగింది అని తెలియచేసారు. పట్టణంలోని  ఇసుకవాగు కేంద్రంలో ఫ్యాన్సీ దుకాణాలు నిర్వహించే బాలు, రాము, కొండలు తగిన ఎటువంటి లైసెన్స్ అనుమతులు లేకుండా పెద్ద స్థాయిలో   బాణ సంచా నిల్వ ఉంచడంతో  వారిని అదుపులోకి తీసుకుని నిల్వ  చేసిన బాణసంచా   స్వాధీనం చేసుకున్నట్లు తెలియచేసారు.


ఇక బాణసంచా  సామగ్రిని న్యాయస్థానంలో అప్పగించనున్నట్లు తెలియచేయడం జరిగింది. తనిఖీల్లో పాల్గొన్న బృందాన్ని అభినందించారు. ఈ సమావేశంలో  ఎస్సైలు పి.నాగశివారెడ్డి, షేక్ రజియా సుల్తానా, ఏఎస్సై చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో పలు మండలంలో కూడా దాడులు నిర్వహించడం జరిగింది.


ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులోని బాణసంచా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్  కారణంగా పేలుడు సంభవించడం కూడా జరిగింది. ఈ సంఘటనలో బాణసంచా పేలుడులో బాణసంచా దుకాణం నిర్వహకుడితో పాటు 9 మంది బాగా గాయపడడం జరిగింది. బాణసంచా దుకాణం వ్యాపారస్తులు పేలుడులు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము.


మరింత సమాచారం తెలుసుకోండి: