తన సబ్‌స్క్రైబర్లకు తీపికబురు అందించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) రెడీ అవుతోంది. అదేమనగా పెన్షన్ పొందడానికి వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రతిపాదిస్తోంది. పింఛన్ లబ్ధిదారులు వయో పరిమితిని పెంచుకునే వెసులుబాటును కల్పించాలని చూస్తోంది. అంతేకాదు, 60 ఏళ్లు వచ్చాక పెన్షన్ తీసుకున్న వారికి కొంత అదనంగా బోనస్‌తో ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని భావిస్తోంది. వయో పరిమితిని రెండేళ్లు పొడిగించడం ద్వారా ఉద్యోగి పెన్షన్ మొత్తం పెరుగుతుంది.


ఇకపోతే పెన్షన్ తీసుకోవడానికి వయసు పరిమితిని పెంచాలనే ప్రతిపాదన ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ‌కి కూడా ప్రతిపాదన పంపామని పేర్కొన్నారు. ఈ ట్రస్టీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తర్వాత విషయం కేబినెట్ అప్రూవల్ కోసం కేంద్ర కార్మిక శాఖకు వెళ్తుందని వివరించారు.. కాగా, రిటైర్మెంట్ తర్వాత పింఛన్ పొందే వయస్సును 60 సంవత్సరాలకు పెంచే ఆలోచన ఈఫీఎఫ్ఓ మదిలో ఎప్పటి నుంచో ఉందని తెలిపారు..


ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్ 95) కింద ప్రస్తుతం 58 ఏళ్ల వరకు నిధులను సంస్ధ జమ చేసి, 58 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ అందిస్తోంది. మరోవైపు, వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన వారికి పెన్షన్ అర్హత వయసు ప్రస్తుతం 50 కాగా, 55 సంవత్సరాలకు పెంచాలనేది ప్రతిపాదన కూడా ఇదివరకు వచ్చింది. ఇక ఈపీఎఫ్ఓ ప్రకారం వయో పరిమితిని పెంచడం వల్ల పెన్షన్ ఫండ్ లోటు రూ.30,000 కోట్లను తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే, సబ్‌స్క్రైబర్లకు కూడా రెండు సంవత్సరాలు ఎక్కువగా కలిసి రావడంతో  పాటూ  అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఇకపోతే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం 1955 ప్రకారం ఒక ఉద్యోగి జీతంలో 8.33 శాతం పెన్షన్‌ అకౌంట్‌కు వెళ్తుందని పేర్కొన్నారు ..


మరింత సమాచారం తెలుసుకోండి: