జగన్మోహన్ రెడ్డిపై అక్కసుతో తప్పుడు కథనాలు అచ్చేసిన రాధాకృష్ణ  తన పరువును తానే పోగొట్టుకున్నారు.  మంగళవారం మధ్యాహ్నం అమిత్ షా-జగన్ మధ్య భేటి జరగటంతోనే రాధాకృష్ణ పరువు పోయింది.  సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసేందుకు జగన్ ఢిల్లీకి వెళ్ళారు. మధ్యాహ్నం నుండి ఎదురుచూసినా రాత్రి వరకు కూడా అమిత్ షా నుండి పిలుపు రాలేదు. నిజామాబాద్ బిజెపి ఎంపి దర్మపురి అర్వింద్ ను కలిసిన కేంద్రమంత్రి నుండి జగన్ కు మాత్రం కబురు రాలేదు.

 

అయితే ఇదే విషయంలో ఎల్లోమీడియా రెచ్చిపోయింది. పిపిఏలు, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం అభ్యంతరాలు పెట్టినా జగన్ పట్టించుకోని కారణంగానే అమిత్ షా జగన్ పై బాగా కోపంగా ఉన్న కారణంగానే అపాయింంట్మెంట్ ఇవ్వలేదన్నట్లుగా ఓ ఊహాగానాన్ని అల్లేశారు.

 

అలాగే సిఎం అయిన తర్వాత కేసుల విచారణలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ జగన్ సిబిఐ కోర్టులో పిటీషన్ వేశారు. తనకు వ్యక్తిగత హాజరు ఇప్పించాల్సిందిగా సిబిఐపై ఒత్తిడి పెట్టటానికే జగన్ వచ్చినట్లు అమిత్ షా అనుకున్న కారణంగానే భేటికి సమయం ఇవ్వటం లేదని ఊహించేశారు.

 

ఇక్కడ రాధాకృష్ణ మరచిపోయిన విషయం ఏమిటంటే పవన, సౌర విద్యుత్ ధరలను సమీక్షించాలని జగన్ అనుకున్నది రాష్ట్ర ప్రయోజనాలను ఆశించే. అదే పద్దతిలో బిజెపి పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాధ్ కూడా ఇదే పని చేశారు. కాబట్టి జగన్ చేసిన పనిలో తప్పేమీలేదు. ఇక వ్యక్తిగత మినహాయింపును కోరుతూ జగన్ వేసిన పిటీషన్ కోర్టు విచారణలో ఉంది. ఏమైనా ఉంటే కోర్టులోనే తేల్చుకుంటారు జగన్.

 

ఇక పోలవరంలో రివర్స్ టెండర్లను కేంద్రం వ్యతిరేకించిన మాట వాస్తవమే. కానీ అదే రివర్స్ టెండర్ల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 900 కోట్లు ఇప్పటి వరకూ ఆదా అయ్యింది. జగన్ కు అమిత్ షా ఇక అపాయింట్మెంట్ ఇవ్వరని, ఇవ్వకూడదన్న ధోరణిలోనే ఆంధ్రోజ్యోతి మొదటిపేజిలో పెద్ద కథనమే అచ్చేసింది. కానీ మంగళవారం మధ్యాహ్నం అమిత్-జగన్ భేటి అయ్యారు. పైగా ఈ భేటిలో 8 మంది ఎంపిలను కూడా జగన్ తీసుకెళ్ళటం గమనార్హం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: