ఏడు జన్మలు., మనిషిని పోలిన మనుషులు ఏడుగురు., సప్త ఋషులు., సప్తపది., సప్త సముద్రాలు... ఇలా మనం ఏడూ సంఖ్య గుర్తొస్తే చాలా కథలు కవిత్వాలు మొదలు పేట్టేస్తాం... కొంత మంది అయితే అసలు ఈ కథలు ఎంత వరకు నిజం అని ఏకంగా ప్రయోగాలు పరిశోధనలు చేస్తుంటారు.. జన్మ ఒక కారణం.. ఏ కారణం లేనిదే ఒకర్ని ఒకరు కలవలేరు అన్నట్టుగా ఇప్పుడు బంగ్లాదేశ్ మహిళ విషయంలో రుజువైంది.. కానీ ఆమెకు మాత్రం ఏడు కాకుండా ఎనిమిది సంఖ్య బాగా కలిసొచ్చింది... అదేంటో ఇప్పుడు చూసేద్దామా మరి... 

 

 

బంగ్లాదేశ్‌ అధికార పార్టీకి చెందిన ఒక మహిళా ఎంపీ తను రాయవల్సిన యూనివర్సిటీ పరీక్షలను తన పోలికలతో ఉన్న 8మంది మహిళల చేత రాయించారు. వినడానికి కాస్త వింతగా ఉన్న ఇది నిజం.. అయితే ఈ విషయం మీడియా సాయంతో బయటపడింది.. వార్త తెలుసుకున్న వెంటనే వర్సిటీ ఆమెను బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే... బంగ్లాదేశ్ అధికార 'అవామీ లీగ్‌' పార్టీకి చెందిన ఎంపీ 'తమన్నా నుస్రత్‌' ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ చదువుతున్నారు. దీనికి గాను మొత్తం 13 సబ్జెకుల పరీక్షలు రాసేందుకు అచ్చం తన లాగే ఉన్న 8 మంది మహిళలను వాడి పరీక్షలు రాయించారు.. ఈ విషయాన్ని నాగరిక్‌ టీవీ అనే ప్రముఖ వార్త చానెల్‌ బయట పెట్టింది. పరీక్షలు రాస్తున్న సమయంలో వారికి ఎంపీ అనుచరులు కాపలాగా ఉన్నారని సమాచారం.. 

 

స్పందించిన వర్సిటీ అధికారులు ఎంపీ నుస్రత్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ!! వర్సిటీ అధికారుల హస్తం లేకుండా ఇంత గొప్ప సాహసం చేసే ధైర్యం ఎవరికి ఉండదు.. పరిక్ష సమయంలో ఇన్విజిలేషన్ బాధ్యత కేవలం యాజమాన్యం కు మాత్రమే ఉంటుందని., ఎంపీ అనుచరులకు కాదని..,, తోటి విద్యార్థుల ఆలోచన.. నాగరిక్ టీవీ ఛానెల్ వారు ఫోకస్ పెట్టి గుట్టు రట్టు చేయడం వలనే యూనివర్సిటీ అధికారులు తప్పక ఆమెను బహిష్కరించాల్సి వచ్చిందని.. లేకపోతే ఆమెకు గోల్డ్ మెడల్ ఇచ్చి వుండే వారేమో అన్న అనుమానాలు తోటి విద్యార్థులలో లేక పోనూ లేదు...!!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: