టెక్నాలజీ అభివృద్ధి చెందక ముందు పొరుగు దేశాలలో పేరుగాంచిన ఇంటర్నెట్ గురించి తెలుసుకొని ఇలాంటి ఒక నెట్వర్క్ మన దేశంలో కూడా ఉంటే బావుంటుంది అనుకోని ఇండియా లో కూడా అభివృద్ధి చేశారు.. కానీ ఇప్పుడు ఆ అభివృద్ధి తీరని శాపంగా మారుతున్న కధనాలు మనం ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం.. అసలు ఇంటర్నెట్ లాంటి ఒక అద్భుత టెక్నాలజీ ఈ రోజు  దాదాపు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు., కానీ ప్రజలు దాన్ని వాడటంలో విఫలమవుతున్నారు.. గూగుల్ లాంటి సెర్చ్ ఇంజెన్ లో కేవలం ఒక క్లిక్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే సౌలభ్యం ఉంది. పేదరికాన్ని నిర్ములించి అభివృద్ధికి మార్గాలు వెతకాల్సిన గూగుల్ ని కొందరు ఏ రకంగా వాడుతున్నారో మనకు తెలియంది కాదు.. 

 

 

నేటి ప్రజాస్వామ్యంలో ఇంటర్నెట్‌ ప్రమాదకారిగా మారిందని, ఇది ఊహించనంత విఘాతాన్ని కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వినియోగదారులు పెరిగే కొద్దీ దేశం ముందుకు వెళుతోందని కేంద్రం తరఫున వాదలను వినిపించిన రజత్‌ నాయర్‌- ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాలలో చేసే పోస్టుల వల్ల మేలు కన్నా ఎక్కువ కీడు జరుగుతోందని తెలిపారు. ద్వేష భావాలు, నిరాధార వార్తలు, వ్యక్తిత్వ హననం, దేశ వ్యతిరేక కామెంట్లు, పోస్టులు పెరుగుతున్నాయని., సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం నిబంధనలను ఖరారుచేసి తెలియచేసేందుకు మూడు నెలల గడువు కావాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. 

 

 

మూడు నెలల్లో నిబంధనలతో కూడిన సమాచార ముసాయిదాను జనవరి నాటికల్లా సిద్ధం చేస్తామని ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ అదనపు కార్యదర్శి పేర్కొన్నారు. త్వరలో మార్గదర్శకాలు కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు. దేశ అభివృద్ధి సాధించే బాధ్యత దేశంలో బ్రతుకుతున్న ప్రతొక్కరిదీ అని., దేశానికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ నష్టం కలిగే పనులు చేయడం కరెక్ట్ కాదని ప్రజలు తెలుసుకుంటే మంచిది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: