వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఆప్ ప్రయత్నం చేస్తోంది. ఆప్ పార్టీ పెట్టిన కొద్దిరోజుల్లోనే అక్కడ అధికారంలోకి వచ్చింది.  47 రోజుల పాలన తరువాత ఆప్ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు.  ఇలా అయన రాజీనామా చేయడంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు.  రాష్ట్రపతి పాలన తరువాత కేజ్రీవాల్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు.  రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఢిల్లీలో ఐదేళ్లపాటు నిలకడగా ప్రభుత్వం నడిచింది.  


వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో మరలా గెలిచేందుకు ఆప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  ఇప్పటి నుంచే ఆ పార్టీ అక్కడి ప్రజలకు వరాలను కురిపిస్తోంది.  మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం, 70 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ వంటి పధకాలు ప్రవేశపెట్టింది.  ఈ పధకాలు ఢిల్లీలో మరలా కేజ్రీవాల్ ను అధికారంలోకి తీసుకొస్తాయా లేదా అన్నది చూడాలి.  అయితే, ఇప్పటికే చాలామంది ఆప్ నుంచి బయటకు వచ్చి వివిధ పార్టీల్లో చేరుతున్నారు.  


ఆప్ కు చెందిన ఎమ్మెల్యే అల్కా లాంబ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తోంది.  ఇక ఇదిలా ఉంటె, ఆప్ దూకుడు బీజేపీ కళ్లెం వేస్తుందా అంటే పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది.  రెండుసార్లు మిస్ అయ్యింది.  ఈసారి మాత్రం ఢిల్లీ పీఠం గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 7 పార్లమెంట్ నియోజక వర్గాలను బీజేపీ కైవసం చేసుకుంది.  దీంతో బీజేపీ ఢిల్లీపై మరింత పట్టు సాధించింది.  


2015లో జరిగిన ఎన్నికలో మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ పార్టీ ఏకంగా 61 స్థానాల్లో విజయం సాధించి బీజేపీకి, షాక్ ఇచ్చింది.  ఈసారి కూడా అదే విధమైన దూకుడును ప్రదర్శించి బీజేపీకి షాక్ ఇవ్వాలని చూస్తుంటే.. బీజేపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో తిరిగి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమాగా చెప్తోంది.  మరి ఢిల్లీ పీఠం ఎవరిని వరిస్తుంది అన్నది తెలియాలంటే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: