తెలంగాణ లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సమ్మె అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటి అంటే ఈ సమ్మె ప్రభుత్వం కి విరుద్ధ చర్య అని నష్టం కలిగించేది అని అలాంటి చర్య చేసినందుకు గాను జీతాలు ఇవ్వమని స్పష్టం చేసింది.దాంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

మొన్న 19 న చేసిన రాష్ట్ర వ్యాప్త బంద్ గురుంచి అందరికి తెలిసిన అంశమే అలానే ఇద్దరు ఆర్.టీ.సి కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి కూడా అందరికి తెలిసిందే కదా.కోర్టు ని ఆశ్రయించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది.ధర్మ శాసనం ముందు ప్రభుత్వం వైపు లాయర్ ఆర్.టీ.సి వారికి జీతాలు ఇవ్వాలంటే 256 కోట్లు కావాలని కానీ ప్రభుత్వం దగ్గర 7.5కోట్లు మాత్రమే ఉన్నాయని ఇలాంటి సందర్భంలో ఎలా జీతాలు ఇవ్వగలరు అని పైగా వీరు బందు కూడా చేస్తున్నారు.

అని చెప్పెడం తో కార్మికుల వైపు న్యాయవాది అది చాలా తప్పని ముప్పై రోజులుగా తమ గోడు వినిపిస్తూ ఇద్దరు ఆత్మహత్యలు చేసుకొని అన్ని రంగాల సపోర్ట్ తో చేస్తున్న ఉద్యమం అందరికి తెలియనిది కాదు.ఆ సమస్యని పక్క దారి పట్టిస్తు ప్రభుత్వం దెగ్గర డబ్బులు లేవు అని తప్పు దోవ పట్టిస్తున్నారని వాదించారు.ఇందులో భాగంగా వచ్చే 30వ తారీఖున ఖచ్చితంగా సకల జనుల సమ్మె నిర్వహించి ఇంకా పెద్ద ఎత్తులో సమ్మెను ముమ్మరం చేస్తామని హెచ్చరిస్తున్నా కూడా చీమ చటుక్కు మన్నట్టు కూడా లేదని వారు పేర్కొన్నారు.ఏదేమైనా ఇలా ఉద్యమాలతో రాష్ట్రాన్ని నడపడటం చాలా కష్టం ముఖ్యమంత్రి దీని గురుంచి ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి సమ్మె ని వీడి పనిల్లోకి వెళ్లేలా న్యాయం చేయాలని తెలంగాణ ప్రజలంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు."కే.సి.ఆర్ సారు జర వినరాదే".....

మరింత సమాచారం తెలుసుకోండి: