తెలుగుదేశంపార్టీలో కొందరి నేతల పరిస్ధితే విచిత్రంగా ఉంది. అధికారాన్ని అడ్డపెట్టుకుని బ్యాంకుల్లో అప్పులు తీసుకోవటం తర్వాత వాటిని ఎగ్గొట్టటం మామూలైపోయింది. బ్యాంకులో అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన నేతల్లో తాజాగా నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కూడా చేరారు.

 

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల దగ్గర వీబీసీ రెన్యువబుల్ ఎనర్జీ కోసం ఆంధ్రాబ్యాంకులో తీసుకున్న అప్పు ఎగ్గొట్టారు. సరే అప్పు ఎగ్గొడితే బ్యాంకు ఊరుకుంటుందా ? అందుకనే అప్పుకోసం తనఖాగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది లేండి. మరి తీసుకున్న అప్పుల కోసం స్వాధీనం చేసుకున్న ఆస్తులు సరిపోతాయా అంటే సమాధానం చెప్పటం కష్టం.

 

బ్యాంకుకు భరత్ మొత్తం రూ. 13.65 కోట్లు బకాయిపడ్డారు. వరుసగా నాలుగు నెలల నుండి బకాయిలు కట్టకపోవటంతో బ్యాంకు అధికారులు బకాయి తీర్చమని అడిగారు. అయితే భరత్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో బ్యాంకు అధికారులు నోటిసులిచ్చి మరీ ఆస్తులను స్వాధీనం చేసేసుకున్నట్లు భరత్ కు కబురు చేశారు. బకాయిలు చెల్లించి ఆస్తులను విడిపించుకొమ్మంటూ బ్యాంకు చెప్పింది లేండి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తన దగ్గర  సోలార్ ఎనర్జీ తీసుకున్న ప్రభుత్వం బిల్లులను మాత్రం బకాయిపెట్టినట్లు భరత్ ఆరోపిస్తున్నారు. తాను బ్యాంకు డిఫాల్టర్ అయ్యానంటే కేవలం ప్రభుత్వమే కారణమంటూ మండిపోతున్నారు. అంటే భరత్ ఆరోపణలు చూస్తుంటే వైసిపి ప్రభుత్వమే బకాయిలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టి భరత్ ను ఇబ్బంది పెడుతోందని  ఎవరైనా అనుకుంటారు.

 

కానీ జరిగిందేమిటంటే చంద్రబాబునాయుడు హయాంలోనే భరత్ కు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం అపేసింది. టిడిపి హయాంలోనే భరత్ కు బిల్లులు ఆగిపోయాయంటే అందుకు కారణాలను నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు, తోడల్లుడు నారా లోకేషే సమాధానం చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలే అయిన కారణంగా నెపాన్ని వైసిపి ప్రభుత్వంపై నెట్టేసే అవకాశం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: