సియాచిన్ గ్లేసియర్.. పర్వతారోహకులు, సాహస యాత్రికులు, పర్యాటకులకు రారమ్మని పిలుస్తోంది.ఎంత అందమైనదో.. అంతే ప్రమాదకరమైనది కూడా.ఎందుకంటే గంటకోసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుంటాయి.తరచూ ఇక్కడ మంచు తుఫాన్లు సంభవిస్తుంటాయి. సియాచిన్ గ్లేసియర్...  ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ భూమిగా దీన్ని పరిగణిస్తుంటారు.ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మధ్య ఉండే ఓ చిన్న ప్రదేశం ఇది.సియాచిన్ గ్లేసియర్. పర్యాటకులు, పర్వాతారోహల స్వర్గధామం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినా సరే.. సియాచిన్ గ్లేసియర్ అంచులను ముద్దాడాలని కలలు కంటుంటారు.ఇపుడు సియాచిన్ గ్లేసియర్ లో పర్యాటకులకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల కల్పన పరంగా పెద్దగా సౌకర్యాలు లేని జమ్మూ కాశ్మీర్ కు పర్యాటక రంగం ఒక్కటే ప్రధాన ఆదాయ వనరు. అందుకే- ఆ రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే.. సియాచిన్ గ్లేసియర్ ను సందర్శించడానికి పర్యాటకులకు అనుమతి ఇచ్చిందని అంటున్నారు.ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే లడక్ గుండా రాకపోకలను సాగించాల్సి ఉంటుంది. ఫలితంగా- అక్కడ రోడ్లు, హోటళ్లు, పర్యాటక రంగానితో ముడిపడి ఉన్న మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.


ఎప్పటి నుంచో సియాచిన్ గ్లేసియర్ ను సందర్శించాలని భావిస్తోన్న పర్యాటకులకు ఈ నిర్ణయం ఓ వరంలా మారింది.రెండు వివాదాస్పద దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్న ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంది సైన్యం.ఇప్పటిదాకా సియాచిన్ గ్లేసియర్ ను స్థానికులు కూడా సందర్శించలేదంటే ఆశ్చర్యం వేస్తుంది.తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇక ఎవ్వరైనా సియాచిన్ ను సందర్శించడానికి అవకాశం వచ్చింది.                                                                


మరింత సమాచారం తెలుసుకోండి: