తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచ్చలూరు వద్ద  ప్రయాణికులతో  పాపికొండలు టూర్ కి బయలుదేరిన బోటు  ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోని చాలా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 77 మంది తో బోటు  బయలుదేరగా కొంత మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.ఇంకొంత మందిని  మృత్యువు కబళించింది. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు చెల్లాచెదురవ్వగా ... వాటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు .కొన్ని మృతదేహాలను  మృతదేహాలను అధికారులు వెళిక్కితీయగా... ఇంకొన్ని  మృతదేహాల ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆ మృతదేహాలన్ని  మునిగిపోయిన బోటులోనే ఇరుక్కుపోయి ఉంటాయని భావించారు. దీనికోసం గోదావరిలో మునిగి పోయిన బోటు ని  వెలికితీయాలని ప్రభుత్వం భావించింది. 



 ఎన్డీఆర్ఎఫ్ బృందం బోటుని  వెలికి తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ గోదావరి ప్రవాహం ఉదృతంగా ఉండటంతో వారికి అసాధ్యమని చేతులెత్తేశారు. ఆ తర్వాత బోటును వెలికి తీసే పని ప్రైవేటు వ్యక్తుల అప్పగించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బోటు వెలికితీత పనుల్లో అపార అనుభవం ఉన్న ధర్మాడి  సత్యం బృందానికి బోటు  వెలికితీత పనులు అప్పగించింది  ప్రభుత్వం. 22 లక్షలతో ధర్మాడి  సత్యం బృందంతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 



 ధర్మం సత్యం బృందం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.... వాళ్ల ప్రయత్నాలేవీ ఫలించలేదు. వాళ్ల ప్రయత్నాల్లో బోటు  ఆచూకీ దొరికినట్లే దొరికి... ఆ తర్వాత ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే స్కూబా డ్రైవర్లను  నదిలోకి పంపిన ధర్మడి సత్యం బృందం... నది లోపల ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ఆ తర్వాత బోటును  వెలికితీయడానికి గత మూడు రోజులుగా తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. కాసేపటి క్రితమే  ధర్మడి  సత్యం బృందం బోటును నీటి పైకి తీసుకు వచ్చింది. మరికాసేపట్లో బోటుని  ఒడ్డుకు తీసుకురానున్నారు. అయితే బోటులో 5 మృతదేహాలు ఉన్నట్లు ధర్మాడీ  సత్యం బృందం  గుర్తించింది. అయితే బోటు ప్రమాదం జరిగి  38 రోజులు అవుతుండగా... 38 రోజుల నుండి మృతదేహాలు బోటు  లోనే ఉన్నాయి. ఇక ఇప్పుడు బోటును  వెలికి తీయడంతో డెడ్ బాడీలు  బయటపడ్డాయి. అయితే బోట్ లో ఇరుక్కుపోయిన మృతదేహాలన్ని  కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో... అవి ఎవరి మృతదేహాలు అనేది మాత్రం గుర్తించడం కష్టంగా మారింది. కాగా బోటు  పూర్తిగా ధ్వంసం అయినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: