ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే. రైతుల సంక్షేమం కొరకు కొరకు వైసీపీ ప్రభుత్వం రైతులకు మేలు చేసే నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ నెల 15వ తేదీన వైయస్సార్ రైతు భరోసా పథకం ద్వారా సీఎం జగన్ అర్హులైన రైతుల ఖాతాలలో నగదు జమ చేసిన విషయం తెలిసిందే. 
 
 సీఎం జగన్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై యస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజును రైతు దినోత్సవంగా కూడా ప్రకటించింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం కొరకు పార్లమెంట్ నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో రిగ్గు చొప్పున మంజూరు చేసింది. 
 
రైతులు ఎవరైతే బోర్లు వేయించుకోవాలనుకుంటారో వారి వివరాలను నమోదు చేసుకొని బోర్లు వేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం 200 రిగ్గులకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. రిగ్గులకు ఉత్తర్వులను జారీ చేయటం ద్వారా సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు సీఎం జగన్ ఉచితంగా బోర్లు వేయిస్తున్నారు. 
 
ప్రస్తుతం సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు అమిత్ షాను కలిసిన జగన్ ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మరోసారి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అమిత్ షాతో 40 నిమిషాలు భేటీ అయ్యారని రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని హామీలు, పోలవరం అంచనాలకు ఆమోదం, వెనుకబడ్డ జిల్లాలకు నిధులు మొదలైన అంశాల గురించి సీఎం జగన్ అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: