తెలంగాణలో  ఆర్టీసీ కార్మికులు గత 18 రోజులుగా సమ్మె నిర్వస్తున్నారు. అయితే 18 రోజులుగా వివిధ రూపాల్లో కార్మికులు నిరసన తెలుపుతున్న ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కార్మికుల డిమాండ్ లపై  స్పందించలేదు. ఈ నేపథ్యంలో తమ వాదనను ఆర్టీసీ కార్మికులు హైకోర్టులో వినిపించడంతో.... ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వాన్ని చర్చలు జరపాలని  ఆదేశించింది హైకోర్టు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలు జరపపోవడంతో హైకోర్టు ఆదేశాలను సైతం కేసీఆర్ ప్రభుత్వం బేఖాతరు చేస్తూ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపడం లేదని అందరూ విమర్శించారు. ఉన్నత న్యాయస్థానం తీర్పును కూడా కేసీఆర్ పట్టించుకోవడంలేదని ఆర్టీసీ కార్మిక విషయంలో కేసీఆర్ నిరంకుశ వైఖరి అవలంభిస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే . 

 

 

 

 అయితే హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించిన ఆర్డర్ కాపీ  ప్రభుత్వానికి అందకపోవడం వల్లనే ఆర్టీసీ కార్మికుల తో ప్రభుత్వం ఇప్పటువరకు  చర్చలు జరపలేదని  తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపాలని  హైకోర్టు ఆర్డర్ కాపీ  ప్రభుత్వానికి అందడంతో దీనిపై ఏం నిర్ణయం తీసుకోవాలనే దానిపై... రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టిసి ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ సహా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. అయితే ఓ వైపు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తునే ... మరోవైపు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని సీఎం కేసీఆర్ కు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సహా పలువురు ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది. 

 

 

 

 

 ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ  లోని ఈడీ  స్థాయి అధికారులతో కార్మిక సంఘాలు చర్చించేందుకు కెసిఆర్ నిర్ణయించనున్నారని వార్తలు వస్తున్నాయి . అయితే కార్మికుల డిమాండ్లలో  ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలనే డిమాండ్ ను  పక్కన పెడితే మిగతా డిమాండ్ల పరిష్కారం పై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై హైకోర్టుకు తదుపరి విచారణలో ఏం చెప్పాలనే దానిపై నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం. కాగా ఆర్టీసీ కార్మికుల తో చర్చలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో  ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: