ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలుస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైతుల అభివృదద్దె  రాష్ట్ర అభివృద్ధి గా భావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... రైతుల అభివృద్ధికి ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుకు ఏడాది పంట పెట్టుబడి చేయూతనిచ్చేందుకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏటా  13, 500 రూపాయలు రైతులకు ఖాతాలో జమ చేస్తున్నారు . కాగా  రైతుల అభివృద్ధి కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

 

 

 

 రైతులకు మేలు చేకూర్చే  విధంగా ఉచితంగా బోర్లు వేయించేందుకు సిద్ధమవుతోంది ఏపీ  ప్రభుత్వం. భూగర్భ జలాల ద్వారా సాగును  పెంచే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఇందుకోసం ప్రభుత్వమే స్వయంగా రిగ్గులను  కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే వీటి కోసం టెండర్లను పిలిచేందుకు కూడా ఏపీ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం మొదటి విడతలో భాగంగా 200 రిగ్గులను  సమకూర్చుకోవాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల ముందు  పాదయాత్రలో  మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

 

 

 

 

 ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. కాగా  ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం సంకల్పించింది. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు నిర్ణయించింది. దీనికోసం ఏపీ ప్రభుత్వం రిగ్గులను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకుంది. కాగా  ఈ కీలక నిర్ణయంతో ఏపీ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఏపీలో  పాలనను గాడిలో పెట్టి... అవినీతి రహిత పారదర్శక  పాలన అందిస్తున్నారు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: