రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ప్రపంచం మొత్తం అరచేతిలో కి వచ్చేస్తుంది. ఏం కావాలన్న ఎవరి గురించి తెలుసుకోవాలన్న మొబైల్  బయటకు తీసి ఒక్క క్లిక్ ఇస్తే సరిపోతుంది. అంతా కళ్ల ముందు వాలిపోతుంది. అయితే దీన్ని అదునుగా  తీసుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు . ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ ప్రపంచం నడుస్తుండడంతో  వైరస్ మాల్వేర్ లాంటి సైబర్  భూతాలు ఎక్కువ అయ్యాయి. ఆన్లైన్లో మనకు తెలియకుండా కొన్ని లింకులు క్లిక్ చేస్తే ... ఇక అంతే సాలే  గూటిలో చిక్కుకున్నట్లే. అయితే ఎక్కువగా తమకు నచ్చిన సెలబ్రిటీల గురించి ఆన్లైన్లో సెక్స్ చేస్తుంటారు  నెటిజన్లు. 

 

 

 

 ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చే సెర్చ్ రిజల్ట్  ప్రమాదకర వెబ్ సైట్లకు తీసుకెళ్తాయని ... అవి ఆయా నెటిజన్ల వివరాలు సేకరించి ఎంతో నష్టం కలిగిస్తాయని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ  తెలియజేసింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. అయితే నెటిజన్లు ధోనీ పేరును ఆన్లైన్లో సెర్చ్  చేస్తున్నప్పుడు  కాస్త  జాగ్రత్తగా ఉండాలని మెకాఫీ  తెలిపింది. ధోని  పేరు సెర్చ్  చేసినప్పుడు సర్చ్ రిసల్ట్ లో అత్యంత ప్రమాదకరమైన వైరస్ లు  మాల్వేర్ల  కలిగిన వెబ్ సైట్ లింకులు ఉన్నాయని వివరించింది. కాగా దోని తర్వాత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరు సెర్చ్ చేస్తే ఈ ప్రమాదం ఉందట. ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ గౌతమ్ గులాటీ,  సన్నీలియోన్, పాప్ సింగర్ బాద్షా,  రాధిక ఆప్టే, శ్రద్ధకపూర్, మహిళా క్రికెటర్ హర్మాన్ ప్రీత్ సింగ్,  ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో పేర్లు ఉన్నాయి. అయితే ఈ సెలబ్రిటీల గురించి నెటిజన్లు ఆన్లైన్లో సెర్చ్  చేసినప్పుడు... ప్రమాదకర లింకుల నుండి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది మెకాఫీ సంస్థ. 

 

 

 

 అయితే ఇండియాలో సబ్ స్క్రిప్షన్  ఆధారిత వెబ్ సైట్ లు ఎక్కువ అవ్వడంతో... రుసుము చెల్లించి వినోదం కొనుక్కోవడం ఇష్టం లేని కొంతమంది నెటిజన్లు... ఫ్రీగా వినోదం పొందడం  కోసం వివిధ కొత్త కొత్త వెబ్ సైట్ లను  వెతుకుతుంటారు. ఈ నేపథ్యంలోనే వారి సెర్చ్ రిసల్ట్ ను   సైబర్ భూతాలు ప్రమాదకర వెబ్ సైట్లకు  తీసుకుపోతాయి అని చెప్తున్నారు మెకాఫీ సంస్థ . వైరస్ లు, మాల్వేర్ లు  దాడి చేయడం వల్ల నెటిజన్ల ఇన్ఫర్మేషన్ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లి  తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని  మెకాఫీ ఇండియా ఎండి,  ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్  కృష్ణ  తెలిపారు. ఏది ఏమైనా మనకు కావాల్సిన సెలబ్రిటీల గురించి ఆన్లైన్ లో సర్చ్  చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: