ఆర్టికల్ 370 రద్దు తరువాత పాక్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే  కాల్పులు జరుపుతూనే ఉన్నది.  దీంతో ఇండియా ధీటుగా జవాబిస్తోంది.  అయితే, ఆదివారం రోజున పాక్ కాల్పుల ఉల్లంఘనను అతిక్రమించి జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఇండియా జవాన్లు, ఒక పౌరుడు మరణించాడు.  దీంతో ఇండియా ఆగ్రహించింది.  పాక్ కు గట్టిగ బదులు ఇవ్వాలని అనుకుంది.  పీవోకే లో ఉన్న ఉగ్రస్థావరాలపై ఫిరంగులతో దాడి చేసింది. ఈ దాడిలో నాలుగు ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి.  


ఉగ్రవాద స్థావరాలతో పాటు 15 మంది వరకు ఉగ్రవాదులు, పది మంది వరకు పాక్ సైనికులు మరణించారు.  ఇది జరిగిన తరువాత పాకిస్తాన్ సోమవారం రోజున నీలం లోయలో విదేశీ జర్నలిస్టులు పర్యటిస్తున్నారని, కాల్పులు జరపవద్దని చెప్పింది.  దీనికి పాక్ ఒకే చెప్పింది. కానీ, పాక్ మాత్రం దాన్ని అతిక్రమించి కాల్పులు జరపడం మొదలుపెట్టింది.  మంగళవారం మధ్యాహ్నం వరకు పాక్ సైన్యం కాల్పులు జరుపుతూనే ఉన్నది.  


దీంతో స్పందించిన ఇండియా, ఈసారి ఏకంగా బోఫోర్స్ గన్స్ ను ఎక్కుపెట్టి దాడులు చేసింది.  ఈ దాడుల్లో ఏడు పోస్టులు ధ్వంసం అయ్యి.  50 మంది ఉగ్రవాదులు మరణించారు.  ఏడుగురు పాక్ సైనికులు మరణించినట్టు సమాచారం.  ఈ సడెన్ దాడికి పాక్ షాక్ అయ్యింది.  వెంటనే ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ సర్కార్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.  ఈ అత్యవసర సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది తెలియాల్సి ఉన్నది.  


పాక్ అత్యవసరంగా సమావేశం తరువాత ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియాల్సి ఉన్నది. పాక్ ఇలానే ప్రవర్తిస్తే మరిన్ని దాడులు తప్పవని తెలుస్తోంది.  అమెరికా వంటి దేశాలు కూడా ఈ విషయంలో ఇండియాను సపోర్ట్ చేస్తున్నాయి. పాక్ ఉగ్రవాద నిర్మూలన చర్యలు తీసుకోవాలని, ఇండియాకు నమ్మకం కలిగేలా చూడాలని, పాక్ ను హెచ్చరిస్తూ వస్తున్నాయి.  అయితే, పాక్ మాత్రం  తన తీరును మార్చుకోవడం లేదు.  చూద్దాం ఎలా జరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: