ఏపీ రైతులకు మరోమారు గుడ్ న్యూస్ అందించారు ఏపి సర్కార్.వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరుతో  రైతుల పంట పెట్టుబడి సాయం అందించాలని  ఇదివరకే నిర్ణయించిన ఏపీ సర్కార్... ప్రస్తుతం రైతులకు ఉచితంగా బోర్లు కూడా వేయించేందుకు సిద్ధం అయ్యారు.ఇప్పుడు కొత్తగా రైతులకు మేలు చేసేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఈ దిశగా ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసున్నారు ఏపీ సర్కార్. ఏపీ రైతులకు ఇదివరకు ఒక గుడ్ న్యూస్‌ తో వచ్చిన ప్రభుత్వం,రైతులకు ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  ఇప్పుడు మరింత భరోసా ఇవ్వనున్నారు. 

గతంలో రైతు భరోసాకింద ఇచ్చే మొత్తం మరో వేయి రూపాయలు పెంచారు.అక్టోబర్ 15వ తేదీ నుంచి రైతు భరోసా పథకం అమలు దిశగా ప్రభుత్వం ఈపాటికే చర్యలు చెప్పటారని,వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40లక్షల మంది అర్హులైన రైతులను గుర్తించి ఈ పథకం అమలు కూడా జరపనున్నాము అని తెలిపారు.

వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరిట ఇప్పటికే రైతులకు పంట మీద పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్,ఇప్పుడు  రైతులకు ఉచితంగా బోర్లు కూడా వేయించేందుకు సిద్ధమవుతోంది. భూగర్భ జలాల ద్వారా సాగును పెంచే ఆలోచన దిశగా ఉంది ఏపీ ప్రభుత్వం... దీని కోసం స్వయంగా రిగ్గులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని కోసం టెండర్లు పిలిచేందుకు ఉత్తర్వులను జారీ చేశా ప్రభుత్వం వారు.

ఈ పథకం అమలు కోసం మొదటి విడతగా 200 రిగ్గులు సమకూర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది  అని అంటున్నారు అధికారులు.తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే,ఆ హామీ నిలబెట్టు కొనే ప్రయత్నంలో భాగంగా,వాటికీ  తగ్గట్టుగా ఏపీ ప్రభుత్వం రిగ్గుల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: