ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫుల్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. సోమవారమే ఈ భేటి జరగాల్సున్నా వివిధ కారణాల వల్ల మంగళవారం మధ్యాహ్నం జరిగింది. భేటి 24 గంటలు ఆలస్యంగా జరిగినా మొత్తం మీద జగన్ మాత్రం హ్యాపీగా కనిపించారు. ఎందుకంటే మంగళవారం అమిత్ షా పుట్టిన రోజున భేటి జరగటం ఒక కారణమైతే ఊహించని రీతిలో కేంద్రమంత్రి నుండి హామీలు రావటం మరో కారణం.

 

నిజం చెప్పాలంటే సోమవారం నాడు జగన్ ను కలవటానికి కేంద్రమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసి జగన్ వ్యతిరేకులంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఎల్లోమీడియా అయితే ఇదే విషయాన్ని బ్యానర్ గా అచ్చేయటంలోనే వాళ్ళ శాడిజం ఏమిటో అర్ధమైపోయింది. సోమవారం అపాయింట్మెంట్ దొరకనందుకు వాళ్ళిష్టం వచ్చినట్లు ఊహించేసుకుని కథనాలు రాసేసుకుని తృప్తి పడ్డారు.

 

అయితే వాళ్ళ ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు పాపం. జగన్ ఊహించనిదానికన్నా కేంద్రమంత్రి ఎక్కువగా స్పందించినట్లే కనిపిస్తోంది.  45 నిముషాల భేటిలో  విభజన సమస్యలు, వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన నిధులు, ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నుండి గోదావరి జలాల తరలింపు, లోటు బడ్జెట్ భర్తీ, పోలవరంపై ప్రభుత్వం చేసిన సుమారు రూ. 5073 కోట్ల రీఎంబర్స్ మెంట్ తదితర అంశాలను ప్రస్తావించినట్లు వైసిపి వర్గాలు చెప్పాయి.

 

జగన్ డిమాండ్లను విన్న తర్వాత అమిత్ షా బదులిస్తు వివిధ శాఖలతో తానే మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు కూడా వైసిపి నేతలు చెబుతున్నారు. అందుకనే ఇతర కేంద్రమంత్రులతో సమావేశం అవ్వాలని అనుకున్నప్పటికీ షా ఇచ్చిన హామీతో జగన్ వెనక్కొచ్చేసినట్లు చెబుతున్నారు. నిజంగానే అమిత్ షా  ఆ విధంగా హామీ ఇచ్చి చర్చలు జరిపేట్లయితే జగన్ గ్రేట్ అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: