సాధారణంగా గోవులు  దానా, గడ్డి, ఇతర శాఖాహారం. అందుకే గోవులను శాఖాహార జంతువులు అని అందరు అంటూవుంటారు. కానీ గోవాలో మాత్రం మాంసాహార గోవులు ఉన్నాయి అంటే నమ్మండి. అదేంటి  మాంసాహార గోవులు ఉండడమా అని ఆలోచనలో పడ్డారా ...వాస్తవానికి ఇది నిజం. గోవాలో కొన్ని ఆవులు మాంసాహారం తప్ప శాఖాహారంను అసలు ముట్టకపోవడంతో అక్కడి గోశాల అధికారులు సతమతమవుతున్నారు.


అక్కడ గోవుల సంరక్షణలో భాగంగా గోవా ప్రభుత్వం పట్టణ వీధులల్లో తిరిగే 72 ఆవులను పట్టుకుని గోశాలకు తరలించడం జరిగింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే వాటికి ఆహారం ఇస్తుంటే మాత్రం తీసుకోవడం లేదు అని తెలుపుతున్నారు. బలవంతంగా నోట్లోకి పెట్టినప్పటికీ వెంటనే బయటకు వదిలేస్తున్నాయి అంట. ఈ ఆవులు ఎందుకు చేస్తున్నాయో అర్థం కాకపోవడంతో  గోశాల సిబ్బంది అధికారులు  తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత వీరికి అసలు విషయం తెలుసుకున్నారు.


గోశాలకు తరలించా వరకు ఆవులు అక్కడక్కడే తిరుగుతూ మిగిలిపోయి పడవేసిన మాంసాహారం తిని దానికే అలవాటు పడిపోవడంతో వెజిటేరియన్ ఆహారంను మర్చి పోవడం జరిగాయి అని తెలుసుకున్నారు. దీనికి సంబంధించి  విషయాన్ని ప్రభుత్వంకి తెలియచేయడంతో  వెంటనే ఆవులు మాంసాహారం నుంచి శాఖాహారంకు మారేలా చూడాలంటూ నిపుణులు  రంగంలోకి రావడం జరిగింది.


ఇది ఇలా ఉండగా ఆవులు పూర్తిగా వెజిటేరియన్ ఆవులు  ఉంటాయి అని  చెప్పడానికి వీలు లేదని ఓ వెటిరెనరీ డాక్టర్ కూడా తెలిపారు. దీని ప్రకారం  గోవులు ఆయా పరిసరాలను బట్టి వాటి ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ ఉంటాయని తెలియచేసారు ఆ డాక్టర్.  ఆవులు వెజిటేరియన్ అనే అనుకుంటూ ఉంటారు  చాలామంది అని ఆ వైద్యుడు తెలియచేయడం జరిగింది. మొత్తానికి ఈ మాంసాహారం అలవాటు ఉన్న గోవులను గోవా ప్రభుత్వం నియమించిన నిపుణులు తిరిగి వెజిటేరియన్ వైపు మారుస్తారో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: