ఐరాస సభ్యదేశాల్లో పాక్ కు మద్దతు ఇస్తున్న దేశాల్లో మలేషియా ఒకటి.  ఐరాస సర్వసభ్య దేశాల సమావేశంలో కాశ్మీర్ విషయంలో ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడిన మలేషియాపై ఇండియా ఫైర్ అయ్యింది.  పాక్ కు సపోర్ట్ చేస్తూ ఆ దేశాన్ని  వెనకేసుకుంటూ వచ్చింది.  దీంతో ఇండియా ఆ దేశంతో వాణిజ్య విషయంలో ఆలోచనలో పడింది.  ఆ దేశం నుంచి ఇండియా ఎక్కడా మొత్తంలో పామాయిల్ ను దిగుమతి చేసుకుంటుంది.  మలేషియా నుంచి సంవత్సరానికి 2 బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతుంది.  


ఈ ట్రేడ్ బిజినెస్ కు ఇండియా చెక్ పెట్టింది.  మలేషియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్ పై నిషేదిరం విధించింది.  ఇకపై ఆ దేశం నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకుంది.  ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ వర్తక సంఘాలు కూడా సమర్ధించాయి.  దీంతో ఇండియా ఆ దేశం నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకోవడం పక్కన పెట్టింది.  


మలేషియా నుంచి దిగుమతి ఆపేసి.. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకోవాలని చూస్తున్నది.  అయితే, మలేషియా మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని అంటోంది.  దిగుమతి చేసుకోవడమా ఆపేసినా.. దానివలన నష్టం వచ్చినా సరే.. కాశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.  


జమ్మూ కాశ్మీర్ పై  తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోనని స్పష్టంచేశారు. అలాగే, ఈ సమయంలో పామాయిల్ అంశాన్ని అంతర్జాతీయ వాణిజ్య సంస్థ వద్దకు కూడా తీసుకురాబోమన్నారు. భారత వ్యాపారులు తీసుకున్న నిర్ణయం చాలా పెద్దదనీ.. మలేషియన్ పామాయిల్ ఉత్పత్తిదారులపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆ దేశ వాణిజ్య నిపుణులు పేర్కొంటున్నారు.  ఈ ఏడాది జనవరి - సెప్టెంబర్ మాసాల మధ్య మధ్య మలేషియా నుంచి భారత్  3.9 మిలియన్ టన్నుల మేర పామాయిల్ను కొనుగోలు చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: