తన భర్త భార్గవ్‌తోపాటు కుటుంబానికి ఏ మాత్రం హాని జరిగినా కర్నూలు ఎస్పీ ఫకీరప్పదే బాధ్యతన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఎస్పీ ఫకీరప్పపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలపెట్టబోనని హెచ్చరించారు అఖిలప్రియ. 


తన భర్త భార్గవ్‌పై ఇటీవల ఏపీ, తెలంగాణాల్లో నమోదైన వరుస కేసులపై మాజీ మంత్రి అఖిలప్రియ స్పందించారు. ముఖ్యంగా కర్నూలు ఎస్పీ ఫకీరప్పను టార్గెట్‌ చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చేస్తున్న అరాచకాన్ని హీరోయిజం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. గతంలో భూమా నాగిరెడ్డిపై ఎలా తప్పుడు కేసులు పెట్టారో.. ఇప్పుడు తన భర్త భార్గవ్‌పైనా అలాగే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు అఖిలప్రియ. 


తనను భయపెట్టేందుకు పోలీస్‌ ఉద్యోగాలు చేయొద్దని, తప్పుడు కేసులకు తాను, కార్యకర్తలం భయపడబోమని.. అధికారంలో ఉన్నవారి మాట వినే విధానం పోలీస్‌ శాఖలో మారాలని వ్యాఖ్యానించారు అఖిలప్రియ. రాజకీయాలు కాకుండా ఉద్యోగాలు చేయాలని పోలీస్‌లను ఉద్దేశించి పేర్కొన్నారు. తన భర్త భార్గవ్‌పై తప్పుడు కేసుల వెనుక రాజకీయ హస్తం ఉందని, ఆయన్ని 
ఐదేళ్ల రాజకీయాల్లో చాలా నేర్చుకున్నానని చెప్పారు అఖిలప్రియ. ఎన్నికల్లో ఓడిపోవడం ఒకరకంగా మంచిదే అయ్యిందన్నారు. ఓటమి తర్వాత ఎవరేంటో తెలుసుకున్నానని.. భార్గవ్‌ రామ్‌ క్యాస్ట్‌ వల్లే ఓడిపోయాననే వార్తలు బాధించాయని అఖిల. పులివెందులకు వెళ్లిరాగానే కేసులు నమోదయ్యాయన్నారు. పోలీసులు తమ ఇంటికి వచ్చి ముగ్గురిని అరెస్ట్‌ చేశారనేది అవాస్తవమనీ, తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరిపై కూడా తప్పుడు కేసులు  పెట్టలేదని చెప్పారు. జిల్లా ఎస్పీ పర్సనల్‌గా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు అందజేస్తానన్నారు అఖిలప్రియ. 


తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలపెట్టబోనని హెచ్చరించారు మాజీ మంత్రి. వారెంట్‌ లేకుండా ఇళ్లలో సెర్చ్‌ చేయడం హీరోయిజం కాదన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా భయపడబోనన్నారు. అలాగే యురేనియం తవ్వకాలపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. బెయిల్‌ వచ్చినా తమను ఇబ్బది పెట్టడం మంచిది కాదన్నారు అఖిలప్రియ. 


మరింత సమాచారం తెలుసుకోండి: