ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు సునిల్ శర్మ, నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ సుల్తానియా, ఇడిలు పాల్గొన్నారు.


ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్ ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఇ.డి.లతో ఆర్టీసీ ఎండి కమిటీని నియమించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్టీసీ ఎండిగా వ్యవహరిస్తున్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఇడి. టి. వెంకటేశ్వర్ రావు అధ్యక్షుడిగా ఇడిలు ఎ. పురుషోత్తం, సి. వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేష్ లు సభ్యులుగా కమిటి ఏర్పడింది.


హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండికి అందిస్తుంది. వాస్తవానికి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో చాలా వరకూ ఆర్థికపమైన అంశాలు కానే కావు.. వీటిని పరిష్కరించడం చాలా సులభం అని చాలామంది నిపుణలు చెప్పారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన మొదట్లోనే ఇలాంటి పని చేసి ఉంటే.. కార్మికుల్లోనూ చలనం వచ్చేది.. సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడేవి.


ఇప్పటికైనా ఈ కమిటీ కార్మికుల డిమాండ్లపై చర్చించి.. ఆర్థిక పరం కాని డిమాండ్లను నెరవేరిస్ేత కార్మికులు కూడా సమ్మె విరమణ దిశగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఆలస్యంగానైనా ఇలాంటి చర్చల పర్వం దిశగా అడుగులు పడటం మెచ్చుకోవాల్సిన విషయమే. మరి ఈ ఈడీల కమిటీ ఏం తేలుస్తుందో.. కార్మికుల డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: