నోరా వీపుకు చేటే అని సామెత ఒకటి ఉంది. మరి పెద్ద  నోరు ఉంది కదా అని ఎంత మాట పడితే అంత అంటే జరగాల్సింది జరిగితీరుతుంది. అదే ఇపుడు రుజువు అయింది. మలేషియా ప్రధాని తాపీగా చేసిన కొన్ని కామెంట్స్ భారత్ కి మంట పుట్టించాయి. అంతే తోక కట్ చేసి పారేసింది. ఇపుడు ఎందుకు అన్నానా అని మధనపడడం మలేషియా ప్రధాని వంతు అవుతోంది.


ఈ వివరాలు ఇలా ఉన్నాయి. మలేషియా ప్రధాని మహతీర్ మహమ్మద్ భారత్ మీద అక్కసు వెళ్ళగక్కారు, అచ్చం పాక్ నోట్లో నుంచి మాట్లాడినట్లుగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ కాశ్మీర్ని ఆక్రమించుకుందిట. ఇవి ఎవరైనా ఇప్పటివరకూ అన్నారా, ఇక ముందైనా అనగలరా, మరి మహ‌తీర్ కి నోటి తీట అలా అనిపించిందేమో. 


పోనీ ఇదే మొదటి సారి కాదు, గతంలో అన్న దాన్ని ఆయన రెట్టించి మరీ ఆని ఆ మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పుకున్నారు. దాంతో భారత్ కి మండుకొచ్చింది. అంతే మలేషియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్ ని బంద్ చేసి పారేసింది. ప్రపంచంలో అత్యధికంగా మలేషియా  నుంచి పామాయిల్ దిగుమతి చేసుకునే దేశాలలో భారత్ మూడవది. 


భారత్ లోని పామాయిల్ శుద్ధి కంపెనీలన్నీ ఒక్క మాట మీద నిలబడి కట్ చేసి పారేశాయి.  అంతే అతి పెద్ద వాణిజ్యం దెబ్బతినిపోయింది. ఇపుడు తాను అన్న మాటలకు మలేషియా  ప్రధాని మహతీర్ బాధపడినా ప్రయోజనం లేదనుకోవాలి. భారత్ మీద అక్కసుతో డెబ్బయ్యేళ్ళుగా పాక్ ఎలా అలమ‌టిస్తోందో చూసి కూడా మహతీర్ నోటి తీట చూపించడమంటే దెబ్బకు కుదేల్ అయినట్లే మరి. ఇది చూసిన ఏ ముస్లిం దేశం కూడా ఇలాంటి గాలి మాటలు మళ్ళీ అనడానికి సాహసించని షాక్ భారత్ ఇచ్చేసిందిగా.



మరింత సమాచారం తెలుసుకోండి: