తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె  19వ రోజుకు చేరుకుంది. కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం  కార్మికుల డిమాండ్లు పరిష్కారం దిశగా ఆలోచించలేదు. దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగడంతో మొదటి రోజు నుంచే  ప్రయాణికులకు తిప్పలు మొదలయ్యాయి. దసరా పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రజలందరూ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి బస్సులను నడిపింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం నడిపిన ప్రైవేటు అద్దె బస్సులు ప్రయాణికుల అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేకపోతున్నాయి . దసరా పండక్కి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక  తప్పలేదు. 

 

 

 

 

 ఇదిలా ఉండగా సమ్మె రోజు రోజుకు ఉదృతం అవుతుందని... ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటానికి రోజురోజుకు మద్దతు  పెరుగుతుండడంతో రాష్ట్రంలో సమ్మె ఎఫెక్ట్ పెరుగుతుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయి . ఇప్పటికే సమ్మె ఎఫెక్ట్ తో  ఆర్టీసీ బస్సుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆర్టీసీ సమ్మె  19 రోజులు చేరుకున్నప్పటికీ ఇప్పుడు వరకు కేసీఆర్  ఆర్టీసీ సమ్మె పై స్పందించకపోవడం... అటు ప్రభుత్వం  నడుపుతున్న బస్సులు  పూర్తిస్థాయిలో ప్రయాణికుల అవసరాలు తీర్చలేక పోవటం వెరసి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో ఈ నెల  14 వరకు ఉన్న విద్యా సంస్థల సెలవులను 19 వరకు పొడిగించింది ప్రభుత్వం. 

 

 

 

 

 అయితే విద్యా సంస్థలు పున ప్రారంభం అయ్యే సరికి కెసిఆర్ ఆర్టీసీ సమ్మె పై ఏదో నిర్ణయం తీసుకుంటారని అనుకున్నారు . కానీ విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికీ కూడా కెసిఆర్ ఆర్టీసీ సమ్మె  పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విద్యార్థులకు కూడా తిప్పలు తప్పడం లేదు . తెలంగాణలో చాలావరకు విద్యార్థులందరూ ఆర్టిసి బస్సు లోనే స్కూలు కాలేజీలకు వెళుతుండటంతో... ప్రభుత్వ నడుస్తున్న బస్సులో విద్యార్థుల అవసరాలను తీర్చేలేకపోతున్నాయి . దీంతో పడిగాపులు కాసి మరి వచ్చిన బస్సుల్లోనే ఫుట్ బోర్డింగ్  చేసుకుంటూ వెళుతున్నారు విద్యార్థులు. అయితే తాజాగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా తన కుటుంబంతో కలిసి నిరసన తెలిపిన  ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక డ్రైవర్ కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ కార్మిక విజ్ఞప్తితో  చాలా మంది తాత్కాలిక డ్రైవర్లు విధులకు హాజరు కాలేదు. మొన్నటి వరకు ప్రభుత్వం 8000 బస్సులు  తిప్పితే ... నిన్న 5,235 బస్సులు మాత్రమే తిప్పినట్టు ప్రకటించింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: