2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుండి పోటీ చేసినా ఈ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ప్రస్తుతం హైకోర్టు రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు 2019 ఎన్నికలలో రాపాక వరప్రసాద్ దొంగ ఓట్లు వేయించారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో హైకోర్టును ఆశ్రయించారు. 
 
హైకోర్టు రిటర్నింగ్ అధికారిని పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. హైకోర్టు ఆదేశాలతో రాపాక వరప్రసాద్ చిక్కుల్లో పడినట్లే అని తెలుస్తోంది. నిజంగానే దొంగఓట్లు వేయించినట్లు, రిగ్గింగ్ కు పాల్పడినట్లు ప్రూవ్ అయితే రాపాక ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం కూడా ఉంది. 
 
రాపాక వరప్రసాద్ హైకోర్టు ఆదేశాల గురించి స్పందించాల్సి ఉంది. గతంలో రాపాక వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 2009 ఎన్నికల సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి రాపాక వరప్రసాద్ కు  రాజోలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా రాపాక రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత రాపాక వరప్రసాద్ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. 
 
పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్ కు రాజోలు ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని ఓడించి రాపాక వరప్రసాద్ ఘన విజయం సాధించారు. కానీ ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. రిటర్నింగ్ అధికారి రాపాక వరప్రసాద్ దొంగ ఓట్లు వేయించి, రిగ్గింగ్ చేసి గెలిచినట్లు నివేదిక ఇస్తే మాత్రం రాపాక వరప్రసాద్ కు, జనసేన పార్టీకి మాత్రం ఇబ్బందే అని చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: