2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఎటువంటి పరాజయాన్ని మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. ఆ పార్టీకి కేవలం 23 సీట్లను మాత్రమే వచ్చాయి. కానీ బాబు గారు మాత్రం ఎన్నికలు జరిగి కనీసం నాలుగు నెలలు కూడా కాక ముందే .. జనాలు తనను మళ్ళీ రావాలనుకుంటున్నారని సభల్లో కామెడీని చేస్తున్నారు. చంద్రబాబుకు ఓ 60 లేదా 70 సీట్లు వచ్చి ఉంటే సరే అనుకోవచ్చు. కానీ ఘోర ఓటమిని చవి చూసిన తరువాత కూడా తన గురించి ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటున్నారు. గ్రాఫిక్స్ బొమ్మలు గీసి రాజధాని అని నమ్మించిన బాబు గారు ఇప్పుడు ఆ రాజధానిని వైసీపీ పాడుచేస్తుందని ఎక్కడ లేని కామెడీని పండిస్తున్నారు. 


అదేదో ప్రపంచ రాజధాని మాదిరిగా బాబు గారు ఇంకా తన గురించి తాను డబ్బాలు కొట్టుకుంటుంటే .. నోరెళ్లబెట్టడం జనాల వంతైంది. బాబు గారు ఇక మారరని జనాలు కూడా ఒక క్లారిటీకి వచ్చేశారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇలా చంద్రబాబు పసలేని ఆరోపణలు చేస్తుండటంతో పార్టీలోనే ఒక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎన్నికల ముందు చంద్రబాబు ఎలాగైతే ప్రపంచ రాజధాని అని .. ఉన్నది లేనిది చెప్పుకుంటూ వచ్చారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా చెబుతుండటంతో టీడీపీ పార్టీ కోలుకోవటం కష్టమేనని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. 


నిజానికి రాజధానిని మార్చాలనే ఉద్దేశం వైసీపీకి లేదని ఇప్పటికే ఆ పార్టీ నేతలు క్లారిటీగా చెప్పేశారు. కానీ అభివృద్ధిని వికేంద్రీకరించే దిశగా అడుగులు మాత్రం వేస్తున్నారని చెప్పాలి. కానీ బాబు గారు దానికే రాష్ట్రంలో ఏదేదో జరిగిపోతుందని .. తెగ ఆవేశపడిపోతున్నారు. ఐదేళ్ల పరిపాలనలో ఏమి చేయలేని చంద్రబాబు కేవలం నాలుగు నెలల ప్రభుత్వం మీద విమర్శలు కురిపించడం ఇప్పుడు విడ్డురంగా ఉందని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: