రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.  చంద్రబాబునాయుడు కొద్ది రోజులుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జపం చేస్తుండటమే  విచిత్రంగా ఉంది.  ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న చంద్రబాబు అదే సమయంలో వైఎస్సార్ పరిపాలన మాత్రం బ్రహ్మాండమని ఎందుకు కీర్తిస్తున్నారు ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

ఇదే చంద్రబాబు ఒకపుడు ఇదే వైఎస్సార్ ను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.  వైఎస్సార్ బతికున్నంత కాలం ప్రతి విషయంలోను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించేవారు. వైఎస్ ప్రభుత్వంపైన కూడా తన మద్దతు మీడియాతో ఎన్నో తప్పుడు రాతలు రాయించిన విషయం అందరికీ తెలిసిందే. 

 

రాజకీయంగా వైఎస్సార్ ను దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ వైఎస్సార్ ముందు చంద్రబాబు పప్పులుడకలేదు. జాతీయస్ధాయిలో తన గురించి బ్రహ్మాండంగా కథనాలు రాయించుకున్నా, రాష్ట్రంలో జాతిమీడియాలో పాజిటివ్ గా ఒకటే ఊదరగొట్టించుకున్నా జనాలు మాత్రం వైఎస్సార్ నే నమ్మారు. అందుకనే  2004, 2009లో చంద్రబాబు బోల్తా పడ్డారు.

 

సరే తర్వాత హఠాత్తుగా వైఎస్సార్ మరణంతో రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరిగింది అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో  జగన్మోహన్ రెడ్డి చేతిలో చంద్రబాబు చావు దెబ్బతిన్నారు. అప్పటి నుండి చంద్రబాబు వైఎస్సార్ జపం మొదలుపెట్టారు.  జగన్ కొట్టిన దెబ్బకే చంద్రబాబు మైండ్ లోని చిప్ దెబ్బతిన్నదని వైసిపి నేతలంటున్నారు. మరి ఆ కారణంగానే జగన్ పై ఆరోపణలు చేస్తున్న నోటితోనే వైఎస్ ను పొగుడుతున్నారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

టిడిపి నేతల్లో కూడా ఇపుడిదే అనుమానం పెరిగిపోతున్నది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే వైసిపి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు. అలాంటిది ఏకంగా జగన్ ను అనరాని మాటలు అంటూనే వైఎస్ ను ఎందుకు పొగుడుతున్నారో సీనియర్ నేతలకు కూడా అర్ధం కావటం లేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: