మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారం కోల్పోయి చంద్రబాబు నాయుడు కొన్ని రోజులు మౌనంగా ఉన్నారు, ఆ  తర్వాత పార్టీని పునర్నిర్మాణం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు అందులో భాగంగానే ప్రభుత్వ మరియు ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ, అలానే ప్రజలపై నమ్మకాన్ని గెలవాలనే కుతూహలంతో గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై సీఎం జగన్ వైఖరి తెలియక congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ నేతలు రోజుకోమాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని అన్నారు లోకేష్.రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నారా లోకేష్ ట్వీట్ చేశారు.

‘ఏదైనా ఊరిని దుష్టశక్తి ఆవహించినప్పుడు చెట్లు మాడిపోవడం  వంటివి  కథల్లో వింటుంటాం.అమరావతి విషయంలో అదే జరిగిందేమో. నాలుగేళ్ళ క్రితం ఇదే రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడక్కడ చూస్తే ఎడారిని తలపిస్తోంది' అని లోకేష్ వ్యాఖ్యానించారు.

ఇక చంద్రబాబు కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్‌తో రూ. 750 కోట్లు మిగిల్చామని congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ నేతలు చెబుతున్నారని.. కానీ, రూ. 7,500 కోట్లు నష్టం వస్తుందని అన్నారు. రివర్స్ టెండరింగ్ కాదు.. అది రిజర్వ్ టెండరింగ్ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
సామాజిక మాధ్యమాలపైనా ఆంక్షలు విధిస్తోందని అన్నారు. ప్రతిపక్ష సభ్యులను ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని.. శ్రీకాకుళం జిల్లాలో కూడా టీడీపీ శ్రేణులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచమంతా అమరావతి గురించి చర్చించుకునేలా చేశానని, హార్వర్డ్ వర్సిటీలో అమరావతిపై కేసు స్టడీ కూడా చేశారని చంద్రబాబు చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: