తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మొదలై 19వ రోజుకు చేరుకుంది. అయితే ఇప్పటివరకు కార్మికుల డిమాండ్లు పరిష్కారం పై కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక రాష్ట్రంలో సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. అయితే హైకోర్టు ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని సూచించింది.కాగా  హైకోర్టు సూచించిన ఆర్డర్  కాపీ  సీఎం ఆఫీస్ కి  అందడంతో నిన్న సాయంత్రం రవాణా శాఖ మంత్రి సహా  ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సమావేశంలో ఉన్నత అధికారులు మంత్రుల సూచనల మేరకు.... ఆర్టీసీ 21 మాండ్ పరిష్కారానికి ప్రభుత్వం ఐదుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమిటీని నియమించింది. రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీ ఆదేశించింది ప్రభుత్వం. 

 

 

 

 

 అయితే దీనిపై స్పందించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు నోటీసులో పేర్కొన్న విధంగా 26 డిమాండ్ పరిష్కరించాల్సిందేనని...  ఏ ఒక్కదానికి కూడా వదులుకునే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం బేషరతుగా చర్చలకు ఆహ్వానించాలని  ఆయన డిమాండ్ చేశారు. అయితే ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచిన 26 డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని ... వాటిని నెరవేర్చాలని అశ్వద్ధామ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే తమను చర్చలకు పిలవాలని చర్చల ద్వారానే సాధ్యాసాధ్యాలు  పరిలించ వచ్చని   తెలిపారు. 

 

 

 

 

 ఇదిలా ఉండగా కార్మికుల 21 డిమాండ్ల పరిష్కారానికి కమిటీ నిర్ణయించిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు కు సంబంధించిన ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు... దీంతో ఒకవేళ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేయకపోతే పరిస్థితి ఏంటి అని అందరు భావిస్తున్నారు. ఇప్పటికే 19వ రోజుకు చేరుకున్న ససమ్మె  ముగింపు ఏంటన్నది అంతు పట్టడం లేదు. అంతేకాకుండా అటు సమ్మెకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ బీజేపీల పై మండిపడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రధానమంత్రి మోదీ తీసుకొచ్చిన చట్టాన్ని  రాష్ట్రంలో అమలు చేసి ఆర్టీసీ రూట్లను  ప్రైవేట్ పరం చేస్తున్నామని... కానీ బిజెపి నేతలు మాత్రం ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపటం  సమంజసం కాదని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంతే కాకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్ సీఎం దిగ్విజయ్ సింగ్  ఆర్టిసి ని మూసివేసిన విషయం కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకోవాలని తెలుపుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాగా ప్రభుత్వం నియమించిన కమిటీ  నివేదిక అందించిన అనంతరం కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది 

మరింత సమాచారం తెలుసుకోండి: