దీపావళి...ఈ పండుగ పేరు వింటేనే ఎక్కడ లేని జోష్‌ వస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ ఆనందం జరుపుకునే పండుగ ఇది. ఏటా ఏదో ఒక కుటుం బంలో చీకటిని నింపు తోంది. తగు జాగ్రత్తలు చేపట్టక పోవడంతో ప్రమా దాలు చోటు చేసుకుం టున్నాయి. ఒకరికొకరు పోటీ పడి టపాసులు కాల్చడం, అప్ర మత్తతంగా లేకపోవడం, భద్రతా నియమాలను పాటించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ను దగ్గర పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగితే అత్యవసరంగా వైద్యం అందటం లేదు. చాలామంది తమ చేజేతులా ప్రమాదాలను కొని తెచ్చుకుని వారితో పాటు ఇతర జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలని అధికారులు, పెద్దలు చేస్తున్న సూచనలు, సలహాలు పాటించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకంగా తీసుకోవలసిన జాగత్రలు, పాటించాల్సిన సూచనలను తెలుసుకుందాం...


జాగ్రత్తలు...
ప్రతి ఒక్కరూ కాటన్ దుస్తులే ధరించాలి.
కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఒక వేళ నిప్పురవ్వలు పడితే మంటలు త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు ఉపయోగపడుతాయి.
టపాసులకు దూరంగా పసి పిల్లలను ఉంచాలి.
టపాసులు కాల్చేటప్పుడు పిల్లల వద్ద పెద్దలు కచ్చితంగా ఉండాలి.
ఇంట్లో, వీధుల్లో టపాసులు కాల్చరాదు.
ఖాళీ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలి.
ఇంట్లోని సిలిండర్లు, గ్యాస్ స్టౌల వద్ద టపాసులు ఉంచరాదు.
భారీగా శబ్దం వినిపించే టపాసులు కాల్చేటప్పుడు పిల్లలు, పెద్దలు తమ చెవులలో దూది పెట్టుకోవాలి.
దీని వల్ల కర్ణభేరికి ఎలాంటి హాని జరగదు.
అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బందికి తక్షణమే సమాచారం అందించాలి.


టపాసులు కాల్చేటప్పుడు వాటర్‌ బకెట్లు, ఇసుకను దగ్గర ఉంచుకోవాలి. మంటలను అదుపు చేయడానికి ఇవి ఎంతగానో ఉప యోగపడతాయి. ము ఖ్యంగా టపాసులు కాల్చేవారు, విక్షీం చేవారు వదులైన కాటన్‌ దుస్తులను ధరించాలి. సిల్క్‌, టెరీకాటన్‌ వంటి దుస్తులు కాలే గుణం కలిగి ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: