ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా, ఆంధ్ర పప్పు అబ్బో ఇలా ఒకటి కాదు.. రెండు కాదు బోలెడు పేర్లు ఉన్నాయి నారా లోకేష్ బాబుకి. ఈ బాబు ఈ మధ్యనే ఓ వార్తలో బాగా మునిగి తేలాడు. 


ఆ వార్త ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి.. విశాఖ ఎయిర్ పోర్టు వేధికగా నారా లోకేష్ చేసిన దుబారా ఖర్చు మొన్న బయట పడిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు కేవలం 14 లక్షలు అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే బాబోయ్ ఏంటి లోకేష్ చాక్లెట్ లకు, చేకోడీలకు అంత ఖర్చు చేసావా అని ఆశ్చర్య పోయాము. కానీ ఇప్పుడు అంతకు మించి విమినాశ్రయంలో ఖర్చు అయ్యింది తాజాగా సమాచారం అందింది. 


ఆ ఖర్చు ఎంత అంటే... 25 లక్షలు. కేవలం ప్రయాణ సమయంలో లోకేష్ విమానాశ్రయానికి వచ్చినప్పుడు చిరు తిండి ఖర్చు 24 లక్షల రూపాయిలు అయ్యింది. అయితే ఆ చిరుతిండి ఖర్చు అంత కూడా ప్రభుత్వ ఖాతాల్లోనే పడింది. కాగా ఇప్పటికి ఆ బిల్లును చెల్లించలేదు. అయితే 2014 నుంచి 2016 వరకు దాదాపు రూ.12లక్షల బిల్లులను అప్పటి అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌కు చెల్లించారు. 


ఇక 2017 నుంచి 2019 మే 31 వరకు అయిన మొత్తం 13,44,484 రూపాయలు ఈ బిల్లును ఇప్పటికి పెండింగ్‌లోనే ఉంచారు. అయితే ఆ బిల్లు చెల్లించాలంటూ ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యాజమాన్యం అధికారులను సంప్రదిస్తూ వస్తున్నప్పటికీ అన్ని లక్షల బిల్లులు ఎలా చెల్లించాలో అర్ధంకాక జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ బాబు చిరుతిండ్లకే 25 లక్షలు అవ్వడంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: