వైసిపి ప్రధాన కార్యదర్శి పార్లమెంటు సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు  తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తారన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఘాటైన విమర్శలు చేస్తుంటారు విజయసాయి రెడ్డి . అయితే తాజాగా టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... నాలుగు మాసాలు జగన్ పాలనలోనే   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయారని మళ్ళీ తనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించాడు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించి ఘాటైన విమర్శలు చేశారు. ప్రజలంటే మీ కుల మీడియా అధిపతులు,  మీ బంధు గణాలు, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉండే ఐదు కోట్ల మంది జనం అని విజయసాయి రెడ్డి అన్నారు. ఒకవేళ నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తున్నట్లు భావిస్తే... సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు విజయసాయిరెడ్డి. 

 

 

 ఒకవేళ రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే అప్పుడు ప్రజలు అందరు మిమ్మల్ని నిజంగానే కలవరిస్తున్నట్టు అంతా భావిస్తారు అని చెప్పారు. ఒక వ్యక్తి తన టచ్ మహిమతో దేశంలోని ప్రతిపక్షాలన్నింటినీ కోలుకోకుండా  చేశారు అంటూ చంద్రబాబు పై విరుచుకుపడ్డారు  విజయసాయిరెడ్డి. వచ్చే జనవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... 2020 లో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అందరూ ఉహించగలరని...  చంద్రబాబు బిజెపి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన పై విజయ సాయి రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన 4 మాసాల్లోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 80% హామీలను నెరవేర్చారని కొనియాడారు. 

 

 

వంశపారంపర్య అర్చకత్వానికి  ఆమోదం తెలపడం ద్వారా ఆలయాల పైన ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది అర్చక కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే గతంలో కూల్చేసిన ఆలయాలు ప్రార్థనా స్థలాలను పునర్నిర్మించే పనులు  ప్రభుత్వాలు త్వరలోనే ప్రారంభిస్తుందన్నారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: