యురేనియం సర్వే ను  అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే తమ కుటుంబం పై కక్ష్య సాధింపు చర్యలు పెరిగాయని తెలుగుదేశం పార్టీ నాయకురాలు , మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు . ఆళ్లగడ్డలో యాదవాడ గ్రామం లో జరుగుతోన్న సర్వేను అడ్డుకుని , యురేనియం వల్ల జరిగే నష్టాల గురించి తెలుసుకునేందుకు కడప వెళ్లి వచ్చాకే వేధింపులు తీవ్రం అయ్యాయని తెలిపారు . ఇక తన భర్త భార్గవ్ రామ్ పై నమోదైన కేసును అడ్డుగా పెట్టుకుని తమ కుటుంబానికి ఏదైనా హాని చేయాలని చూస్తే కర్నూలు జిల్లా ఎస్పీ పకీరప్ప దానికి పూర్తి  బాధ్యత వహించాలని   అఖిలప్రియ డిమాండ్ చేశారు .


ఇప్పటి కైనా ఎస్పీ తన తీరు మార్చుకోవాలని సూచించారు.  లేదంటే గవర్నర్ ను  కలిసి ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు... అవసరమైతే ఈ విషయంలో రాష్ట్రపతిని కూడా కలిసేందుకు వెనుకాడనని  చెప్పారు.  భయపెడితే భయపడే స్థితి లో తాను లేనన్న అఖిలప్రియ,  గతంలోను  తన తండ్రిని కూడా ఇలాగే పోలీసులు వేధించారని అన్నారు.  వేధింపులు తమ కుటుంబానికి కొత్తేమీ కాదని చెప్పారు .  వ్యాపార లావాదేవీల్లో ఇద్దరు భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ కేసులో బెయిలు వచ్చాక కూడా తన భర్త భార్గవ రామ్ ను  వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.


అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పై ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లో గతం లో కేసు నమోదయింది . ఈ కేసు లో ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని చెబుతోన్న పోలీసులు  , హైదరాబాద్ ,  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో తలదాచుకున్నాడని తెలిసి స్థానిక పోలీసుల సహకారం తో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు . 

మరింత సమాచారం తెలుసుకోండి: