ఏపీలో బీజేపీ ప్రస్తుతం కలగూరగంపలా మారిపోయింది. ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు ఇప్పుడు బిజెపిలో చేరుతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించడంతో అధికార దాహంతో పలువురు నేతలు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వైపు చూస్తున్నారు. నాలుగు నెలల్లోనే బిజెపిలో క్రమక్రమంగా గ్రూపులు పెరుగుతూ ఆధిపత్యం ఎక్కువవుతోంది. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలోకి చేరుతున్న నేతల డామినేష‌న్‌ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.


ఇప్పటికే ఏపీ బీజేపీ విభాగంలో పలు గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కులాలవారీగా నేతలు గ్రూపుల గోల‌లో పడుతున్నట్టు తెలుస్తోంది. అసలు ఎన్నికలకి ముందు కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ బిజెపి ప‌గ్గాలు ఇవ్వడంతోనే ఏపీ బిజెపి కులాల వారీగా చేరిపోయింది. ఇక తాజాగా రాయలసీమకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బిజెపిలో చేరడంతో ఈ గ్రూపుల గోల మరింత ఎక్కువ అయినట్టు తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి రానివ్వకూడదని సీఎంరమేశ్ గట్టిగా ప్రయత్నించాడని సమాచారం.


ముందుగానే బీజేపీలోకి చేరిపోయాడు సీఎం రమేశ్. తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజుల నుంచినే ఆయనకు ఆదినారాయణ రెడ్డితో విబేధాలున్నాయి. ఈ నేఫథ్యంలో ఇప్పుడు ఆదిని బీజేపీలోకి రానివ్వకూడదని రమేశ్ ప్రయత్నించాడట. అయితే ఆ ప్రయత్నాల్లో విఫలం అయినట్టుగా సమాచారం. ఈ క్ర‌మంలోనే ఏపీ బీజేపీలో ప్రాంతాల వారీగాను, జిల్లాల వారీగాను అప్పుడే కుల‌, గ్రూపు రాజ‌కీయాలు మొద‌లైన‌ట్టు తెలుస్తోంది.


ఇక ఆది బీజేపీలో చేరిన‌ప్పుడు తెలుగు రాజ‌కీయ నేత‌లు ఎవ్వ‌రూ అక్క‌డ క‌న‌ప‌డ‌లేదు. కేవలం జీవీఎల్ మాత్రమే ఉన్నారు. ఇక ఏపీ బీజేపీలో క‌న్నా గ్రూపు, రామ్‌మాధ‌వ్ గ్రూపు, సుజ‌నా గ్రూపు, సీఎం.ర‌మేశ్ గ్రూపు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రూపులు త‌యార‌వుతున్నాయి. మ‌రి ఈ గ్రూపులు ఏపీ బీజేపీని ఏ తీరానికి చేరుస్తాయో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: