వీధిలో తిరిగే ఓ ఎద్దు ఏకంగా నాలుగు తులాల బంగారాన్ని మింగేసింది. ఆ ఎద్దు ఊరంతా తిరుగుతే సీసీటీవీలో చూసి వెతికి వెతికి మరి పట్టుకున్నారు. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని సిర్సా జిల్లాలో కలన్‌వాలీ పట్టణంలోని వార్డు నెంబరు 6లో ఓ కుటుంబం నివసిస్తుంది. అయితే ఆ కుటుంబం నిర్లక్ష్యం కారణంగా ఏకంగా నాలుగు తులాల బంగారం ఎద్దు పాలయ్యింది. 


ఆ కుటుంబంలో నివసిస్తున్న అత్త, కోడలు శనివారం రాత్రి పెళ్ళికి వెళ్లారు. ఆ తర్వాత వారి బంగారు నగలను తీసి, కుళ్ళిన కూరగాయల బుట్టలో పెట్టారు. ఆతర్వాత రోజు ఆ బుట్టలో బంగారం ఉందనేది మర్చిపోయి ఆ కుళ్ళిన కూరగాయలతో పాటు బంగారాన్ని బయటకు విసిరేశారు. కాసేపు అయ్యాక బంగారం గుర్తుకు వచ్చింది. ఇంకేముంది బంగారం కోసం చెత్త కుప్ప అంత వెతికారు.. 


దొరకలేదు.. దీంతో సీసీటీవీ కెమేరాలో రికార్డైన వీడియోను చూశారు. ఆ అత్త కోడళ్ళు పడేసిన కూరగాయలను ఓ ఎద్దు తినటం చూశారు. దీంతో ఆ ఎద్దుని వెతికి ఇంటి వద్దకు తెచ్చి కట్టేశారు. ఆ ఎద్దుకు మంచి గడ్డి, చెరుకు పిప్పి అన్ని పెట్టారు. దీంతో ఆ ఎద్దు పేద వెయ్యగానే కష్టమైన సరే ఆ నగలను జల్లాడ పట్టి మరి నగల కోసం వెతుకుతున్నారు. అయినా ఇప్పటివరకు ఒక్క నగ కూడా బయటకు రాలేదు. 


దీంతో ఆ అత్త కోడళ్ళు ఇద్దరు ఒకరినిఒకరు తిట్టుకుంటున్నారు. ఎంత నిర్లక్ష్యం మనకు అని. కాగా అత్తాకోడలు ఆ ఎద్దు వద్ద పడే కష్టాలు చూసి ఆ గ్రామస్థులు నవ్వు కుంటున్నారు. మరికొందరు ఆ కష్టాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ అత్తాకోడళ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటో మీరు చుడండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: