కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ నేత కోసం ఆమె జైలుకు వెళ్లేందుకు సిద్ధ‌ప‌డ్డారు. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత,మ‌నీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న డీకే శివకుమార్‌ను సోనియా కలిశారు. ఆయన ఆరోగ్య  పరిస్థితిని  సోనియా ఆరా తీశారు. కాగా, సోనియా ప‌రామ‌ర్శించిన కొద్దిసేప‌టి త‌ర్వాత శివ‌కుమార్‌కు బెయిల్ దొర‌క‌డం గ‌మ‌నార్హం. దాదాపు 50 రోజులుగా అయన జైల్లోనే ఉన్నారు. 


క‌ర్ణాట‌క కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన డీకే శివ‌కుమార్ ఇంట్లో గత ఏడాది ఐటీ అధికారులు దాడులు చేసి 8 కోట్ల 59 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం మనీ లాండరింగ్ కేసులో ఆగస్టు 31న మొదటిసారి ఈడీ అధికారులు  ప్రశ్నించారు. ఐదు రోజుల విచారణ తర్వాత సెప్టెంబర్ 3న  అరెస్ట్ చేశారు. అప్పటినుంచి డీకే శివకుమార్ తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవలే  కాంగ్రెస్ సీనియర్  నేతలు  కూడా జైలుకు వెళ్లి డీకే  శివకుమార్ ను  పరామర్శించారు. తాజాగా సోనియా నేరుగా తీహార్ జైలుకు వెళ్లి కర్ణాటక కాంగ్రెస్ నేతను ప‌రామర్శించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


మ‌రోవైపు, మనీలాండరింగ్ కేసులో అరెస్టైన డీకే శివకుమార్‌ కు బెయిల్ మంజూరైంది. .  గతంలో అనేక మార్లు అయన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు కొట్టేసింది.  తాజాగా అయన మరోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది. రూ.25 లక్షల పూచీకత్తుతో శివకుమార్‌కు కోర్టు  బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.  డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరు కావడంతో కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.  డీకే శివకుమార్ కు స్వాగతం పలికేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: