కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ కు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు శివకుమార్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు 25 లక్షల రూపాయలు పూచీకత్తు చెల్లించాలని శివకుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు డీకే శివకుమార్ కు దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. డీకే శివకుమార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు 50 రోజుల తరువాత డీకే శివకుమార్ కు బెయిల్ లభించింది. 
 
డీకే శివకుమార్ త్వరలో బెయిల్ పై విడుదల కానున్నారు. డీకే శివకుమార్ పై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు 2017 ఆగష్టు నెలలో శివకుమార్ ఇంటి నుండి 20 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ రంగంలోకి దిగి హవాలా మార్గంలో కోట్ల రూపాయలు ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో దాచారనే ఆరోపణలతో శివకుమార్ ను టార్గెట్ చేసింది. శివకుమార్ తో పాటు ఈడీ మరికొంతమందిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టింది. 
 
డీకే శివకుమార్ ను 2019 సెప్టెంబర్ నెల 3వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. డీకే శివకుమార్ కుటుంబ సభ్యులపై కూడా మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈడీ అధికారులు డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను మనీ ల్యాండరింగ్ గురించి ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో డీకే శివకుమార్, డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను అధికారులు విచారించారు. డీకే శివకుమార్ కూతురు ఐశ్వర్య పేరిట 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 
 
2013 సంవత్సరంలో కేవలం కోటి రూపాయల ఆస్తి ఉండగా 2018 సంవత్సరంనాటికి ఆస్తి 100 కోట్ల రూపాయలకు పెరిగింది. 2017 సంవత్సరంలో డీకే శివకుమార్, ఐశ్వర్యలు సింగపూర్ లో పర్యటించి పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడుల గురించి కూడా ఈడీ విచారణ చేసినట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: