హేమాను మొదట్నుంచీ అభిమానులు "డ్రీం గర్ల్" అని పిలిచేవారు.1977లో అదే పేరుతో సినిమా కూడా చేశారామె.మంచి నాట్యకళాకారిణి అయిన హేమా మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి 11 నామినేషన్లు సంపాదించుకున్న హేమా 1972లో పురస్కారం గెలుచుకున్నారు. ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ఆమె.2012లో సర్ పదంపత్ సింఘానియా విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.

 

2003 నుంచి 2009 వరకు భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు హేమా. ఎన్నో సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు ఆమె.ధర్మేంద్ర జీవితంలోకి తాను ప్రవేశించినప్పటికీ ఆయనను ఏనాడు తన కుటుంబం నుంచి వేరు చేయలేదని అలనాటి డ్రీమ్‌గర్ల్‌, బీజేపీ ఎంపీ హేమ మాలిని అన్నారు. త్వరలోనే రాజకీయాలకు స్వస్తి పలికి తన కూతుళ్లు, మనవలతో జీవితం గడపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

 

ధర్మేంద్రతో ప్రేమ, పెళ్లి తదితర అంశాల గురించి చెప్పుకొచ్చారు. ‘ ధరమ్‌ జీని చూసిన నిమిషంలో ఈయన నా మనిషి.. నా కోసమే పుట్టారు అనిపించారు. అందుకే ఆయనతోనే జీవితం గడపాలనుకున్నా. అందుకోసం ఆయనను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నా. నేనెప్పుడూ ధర్మేంద్రను ఆయన మొటటి భార్య, పిల్లలకు దూరంగా ఉండనివ్వలేదు. వాళ్లు కూడా నేను ఏనాడు వాళ్ల జీవితంలో జోక్యం చేసుకున్నట్లుగా భావించలేదు. ఆయనను వివాహం చేసుకున్నానే తప్ప.. కుటుంబ సభ్యుల నుంచి ఏనాడు వేరుచేయలేదు’ అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: