రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. భయంతో విద్యార్థులు కాలేజీ నుండి బయటకు పరుగులు తీశారు. సకాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. గడచిన మూడు రోజులుగా రాజమండ్రిలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో ఆర్ట్స్ కాలేజీలోని ఒక విద్యుత్ స్తంభం నుండి మంటలు చెలరేగాయని తెలుస్తోంది. 
 
అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని తెలుస్తోంది. ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోనే సబ్ స్టేషన్ కూడా ఉందని సమాచారం. అధికారులకు సమాచారం అందటంతో వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో ప్రస్తుతం ఏ సమస్య లేదని తెలుస్తోంది. నాలుగు అడుగుల వైరు మాత్రం కాలిపోయినట్లు తెలుస్తుంది. 
 
మూడు రోజుల నుండి వర్షాలు కురుస్తూ ఉండటంతో విద్యుత్ స్తంభాలలో సమస్యలు ఏర్పడ్డాయని అందువలన షార్ట్ సర్క్యూట్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్ కు మాత్రం ఎటువంటి సమస్య లేదని తెలుస్తోంది. వర్షాల వలన మరికొన్ని ప్రాంతాలలో కూడా షార్ట్ సర్క్యూట్స్ జరుగుతున్నాయని సమాచారం. అధికారులు వేగంగా స్పందించటం వలన ఎలాంటి ప్రమాదం జరగలేదని విద్యార్థులు చెబుతున్నారు. 
 
ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలలో సమస్యలు ఏర్పడుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పటంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేయటంలో ఆలస్యం జరిగి ఉంటే మాత్రం చాలా మంది విద్యార్థుల ప్రాణాలకు అపాయం కలిగి ఉండేదని తెలుస్తోంది. ప్రస్తుతం వర్షాకాలం కావటంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలో కూడా షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని షైన్ చిన్న పిల్లల ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక పాప మృతి చెందగా ఐదుగురు పిల్లలకు గాయాలయ్యాయి. 





మరింత సమాచారం తెలుసుకోండి: