సోమవారం శ్రీకాకుళంలో చంద్రబాబు నాయుడు ‘మళ్లీ నేను రావాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్పందించారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ప్రశ్నలు వర్షం కురిపించారు.

 

ప్రతి రైతుకు రైతు భరోసా కింద రూ.13,500 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారు.. రైతు రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి వంచించినందుకు ఏ రైతు అయినా మీరు మళ్లీ రావాలని కోరుకుంటున్నారా.

 

అంతేకాదు ‘నేడు సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి.. పల్లెలు పచ్చదనంతో పరిమళిస్తున్నా యి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో సహా గ్రామాల్లోని చెరువులు సైతం నిండుకుండలను తలపిస్తున్నాయి.కానీ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో భూములు బీళ్లు వారాయి. కరువు రక్కసి కరాళనృత్యం చేసింది. తాగునీటికి అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. సాగుకు నీరు లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

 

మద్యం వ్యాపారం పేరుతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దుకాణాలను నడపడమే కాకుండా గ్రామ గ్రామానా, వీధుల్లో, సందుల్లో సైతం బెల్టు దుకా ణాలు ఏర్పాటు చేసి కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసినందుకు ఏ మహిళ అయినా మీరు మళ్లీ రావాలని కోరుకుంటున్నారా..  అని అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: