దేశంలో అత్యంత ప్రాచీన పార్టీ, ద‌శాబ్దాల చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డిక‌క్క‌డ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వ్యూహాత్మ‌క లోపాలు.. త‌ప్ప‌ట‌డుగులు.. పార్టీని తీవ్ర‌స్థాయిలో ఇరుకున ప‌డేస్తున్నా యి. అదేస‌మ‌యంలో పార్టీ యువ‌నాయ‌కుడు, ఎంపీ, అధ్య‌క్ష పీఠానికి రాజీనామా చేసిన(దీనిని ఆమోదించ లేదు) రాహుల్ గాంధీపై న‌మ్మ‌కం కూడా అన్ని రాష్ట్రాల్లోనూ స‌న్న‌గిల్లుతోంది. దీంతో పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టు మాదిరిగా త‌యారైంది. ఎక్క‌డిక‌క్క‌డ పార్టీ నుంచి సీనియ‌ర్లు జంప్ చేస్తున్నారు.


ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో పుంజుకుంద‌ని భావించిన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడు రామ‌మూర్తి జంప్ చేయ‌డం, అదేవిధంగా ఇత‌ర రాష్ట్రాల్లోనూ నాయ‌కులు పార్టీ నుంచి బ‌య‌ట‌కు పోతుండ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది. అయితే, తాజాగాఢిల్లీకి అత్యంత స‌మీపంలోని రాష్ట్రం పంజాబ్‌లోనూ ఇదే త‌ర‌హా దెబ్బ‌లు కాంగ్రెస్‌కు త‌గులుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ముఖ క్రికెటర్ , మాజీ మంత్రి నవజోత్ సిద్దూ భార్య వనజోత్ కౌర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.


ఆమెకు గత ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ వర్గం అంగీకరించలేదు.ఆ నేపథ్యంలో అప్పటి నుంచి ఆమె అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాక ఇటీవల సిద్దూ కూడా మంత్రి పదవి నుంచి వైదొలిగారు. తాజాగా ఆయన భార్య కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. మరి భవిష్యత్తులో సిద్దూ కూడా అదే బాట పడతారా? లేదా అన్నది తెలియాలి. ఇదిలావుంటే, ఈ కుటుంబానికి బీజేపీ నుంచి ఆఫ‌ర్లు వ‌స్తున్న విష‌యం కూడా బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.


రాజ్య‌స‌భ సీటు ఇస్తామ‌ని గ‌తంలోనే బీజేపీ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. అయితే.. అప్ప‌ట్లో బీజేపీ నేత‌లు ముఖ్యంగా అమిత్ షా, ఆయ‌న కుమారుడును కూడా విమ‌ర్శించ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది. మొత్తంగా ఈ ప‌రిణామం.. కాంగ్రెస్‌లో సంచ‌ల‌నం సృష్టించింద‌న‌డంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: