గత కొన్ని  రోజులుగా టిడిపి అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై  తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉందంటున్న చంద్రబాబు... కనీసం ఒక్కసారైనా నిజాలు మాట్లాడారా ఎప్పుడు అబద్ధాలు మాట్లాడటం తప్ప  అని విమర్శించారు బొత్స . చంద్రబాబుకి జగన్ పాలన చూసి ఎందుకు అంత అసహనం ఆక్రోశం  వస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు  మంత్రి బొత్స. అయితే చంద్రబాబు మాటల్లో నాయకత్వ లక్షణాలు కనిపించడం లేదని అన్నారు. ఇక రాజధానిలో అమరావతిలో  ఒక్కటి కూడా శాశ్వత కట్టడం లేదని బొత్స విమర్శించారు.గత టీడీపీ  ప్రభుత్వ హయాంలో అయిదేళ్లలో లక్షా అరవై ఐదు వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు... కేవలం 5,000 కోట్లు మాత్రమే రాజధాని నిర్మాణానికి ఉపయోగించారన్నారు. 



 చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రన్ని  మొత్తం అప్పులు మయం గా మార్చారు అని విమర్శించారు .తనకు ప్రజలు ఐదేళ్ళ పాలన చేసేందుకు అవకాశం కల్పించారని... కానీ తమ పాలనా నచ్చకే  ఎన్నికల్లో ఓడించారని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు అందరికీ గ్రాఫిక్స్ చూపించి మోసం చేశారని అన్నారు.రాజధాని  అమరావతి పక్కన  తన వియ్యంకునికి  ఐదు వేల ఎకరాలను కట్టబెట్టారని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు రాజధాని నిర్మాణం అంటూ   ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమ రాష్ట్ర రాజధాని చిరకాల స్వప్నంగా ఉండాలని కోరుకున్నారని... కానీ చంద్రబాబు మాత్రం రాజధాని కోసం చేసింది శూన్యమన్నారు. 



 తమ ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రాజధాని నిర్మిస్తామని మంత్రి  బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు . జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు చేస్తున్న విమర్శల్లో ఆయన  కడుపుమంట కనిపిస్తుందని ఎద్దేవా చేసారు . అనవసర విమర్శలు చేస్తూ చంద్రబాబు  హుందాతనాన్ని కొలుపుతున్నారని  విమర్శించారు. చంద్రబాబు తమ ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అవినీతి పాలన అందించారని మంత్రి బొత్స విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని అన్ని హంగులతో  రాజధాని నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు మంత్రి బొత్స .


మరింత సమాచారం తెలుసుకోండి: