రామగిరి ఖిల్లా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నుంచి మంథని మార్గంలో ఒక ఎత్తైన పర్వతంపై ఉంది. ఇది  తెలంగాణలో అతిపెద్ద  శత్రు దుర్భేద్యమైన కోటలలో ముఖ్యమైనది. రామగిరి పర్వతంపై  ఉన్న ఈ కోటపై  సీతారామ ఆలయం కూడా ఉన్నది. శ్రీరామచంద్రుడు పన్నెండేళ్ల వనవాస సమయంలో ఈ పర్వతం పై కాలుమోపిన ట్లు కథనం ప్రచారంలో ఉంది. ఈ రామగిరి ఖిల్లా అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనము.  ఆహ్లాదపరిచే ప్రకృతి రమణీయ దృశ్యాలు అబ్బురపరిచే కళాఖండాలు పర్యాటకులను అలరిస్తూ విరాజిల్లుతుంది.


 రామగిరి జిల్లాలో గుహల అవతల వైపు గీరబొమ్మలు(పెట్రో గ్లైప్స్)  ఉన్నట్లు గుర్తించారు. ఈ గీర బొమ్మలు మధ్య రాతి యుగము నాటి చిత్రాలు గా ఉన్నట్లు తెలిపారు. వీటిని గుర్తించిన చిత్రకారుడు సముద్రాల సునీల్ తన పరిశోధనలో వెల్లడించారు. సునీలు తన పరిశోధనలలో ఇంకా పెద్ద రాతి యుగమునకు సంబంధించిన సమాధులు దాదాపు 36 ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇంకా కొన్ని చిత్రాలలో ఎడమ చేతిలో త్రిశూలం ధరించి నిలబడిన వేటగాడు పక్కన ఒక పెద్ద పక్షి ఆనవాళ్లు కూడా ఉన్నాయని వివరించారు.


 ఈ పరిసరాల్లోనే ఇంకా ఇనుప సామాగ్రి మరియు కుండ పెంకులు ఎక్కువగా కనిపించాయని తెలిపారు. మరియు రాతి నేలపై రాళ్ల కుక్కలతో ఎంతో పకడ్బందీగా నిర్మించడం వల్ల అవి ఈరోజు వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పారు. ఇంకా రామగిరి పిల్లలు అన్వేషణను చేస్తే మరి కొంచెం సమాచారము తెలుస్తుందని కూడా చెప్పారు ఇందుకు ప్రభుత్వ సహాయం ఉంటే బాగుంటుంది అని సునీల్ గారు చెప్పారు.


అప్పట్లో రామగిరి కోటకు ఇరువైపులా తొమ్మిది ఫిరంగులు, 40 తోపులు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య కుదించుకుపోయింది. ప్రస్తుతము కేవలము ఒక ఫిరంగి మాత్రమే ఉంది. ఆనాటి రాజుల ఆస్థానంలో సంగీత నృత్య కళాకారులు ఉండే ప్రాంతాన్ని భోగం వాడ అనే వారట. కాలక్రమేణా అది భోగం పేట గా మారింది అని చెప్తారు. ఈ ప్రాంతాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి మరియు పులోమావి రాజులు పరిపాలించినట్లు పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు తెలుపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: