ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఢిల్లీ టూర్ కు వెళ్లిన విషయం తెలిసిందే.  అక్కడ హోంమంత్రి అమిత్ షా తో  సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు అంశాలపై చర్చించేందుకు జగన్ ఢిల్లీ వెళ్లి వెళ్లొచ్చారు  అని  వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం జగన్ అక్రమాస్తుల కేసులో తొలగించుకునేందుకు అమిత్ షా తో  భేటీ అయ్యారని విమర్శలు చేస్తున్నాయి  . ఈ విషయం అమిత్ షా కి  కూడా తెలుసు అందుకే  మొదట జగన్ తో సమావేశం కావడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి . ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పై స్పందించారు. చివరికి ఎలాగోలా అమిత్ షా ను కలిసిన జగన్... ఇతరుల అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో తిరిగి వచ్చారని  వార్తలు వింటుంటే  చాలా బాధేస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు .

 

 

 

మన మీద కేసులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ధైర్యం సరిపోదని... మన మీద కేసులు ఉంటే పైస్థాయి వాళ్ళతో  బలంగా మాట్లాడాలేమని ... అదే కేసులు  సీఎం పై  ఉంటే న్యాయం జరుగుతుందనేది  సందేహాస్పదమని పవన్  కళ్యాణ్ వ్యాఖ్యానించారు.అయితే విశాఖ విమానాశ్రయంలో జగన్ పై కోడికత్తితో దాడి .. ఆ తర్వాత బాబాయ్ వైయస్ వివేకా హత్య వివాదం పై ఒకప్పుడు గగ్గోలు పెట్టిన జగన్ ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం వాటి  ఊసే ఎత్తడం లేదని  పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ సీఎం కాగానే ఎందుకు మౌనంగా ఉన్నారని... సీఎం అయ్యాక బాబాయ్ హత్య కేసు,  కోడికత్తి దాడి గురుంచి  మరచిపోయారా అంటూ విమర్శించారు.

 

 

 

 అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేరాలను ప్రోత్సహిస్తూ ఉండడంవల్లే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో వెళ్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శిహించారు . అసలు అసెంబ్లీ కి వెళ్తే 150 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలను కొట్టేలా  వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఒకప్పుడు టిడిపి హయాంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతే...  ఇప్పుడు ప్రస్తుతం వైసిపి హయాంలో ఇసుక మాఫియా  రాజ్యమేలుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత ఉంది కానీ... తెలంగాణ బెంగళూరుకు మాత్రం ఏపీ నుండే  తరలి వెళ్తున్నదని  పవన్ కళ్యాణ్ విమర్శించారు. అయితే జనసేన చేపట్టిన చలో విశాఖ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: