ఏపీ సీఎంగా జ‌గ‌న్ వేస్తున్న అడుగులు ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో ర‌గ‌డ రేపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వారికి ఏం మాట్లాడాలో కూడా తెలియ‌క‌.. తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఏమాట‌కు ఆమాట చెప్పాల్సి వ‌స్తే.. గ‌తంలో చంద్ర‌బాబు సాధించ‌లేని ప‌నులు జ‌గ‌న్ సాదించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్రం నుంచి ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. ఎన్ని హెచ్చ‌రింపులు వ‌చ్చినా.. జ‌గ‌న్ త‌ను అనుకున్న‌ది సాధించ‌డంలో ముందుకు సాగుతూనే ఉన్నారు త‌ప్పితే.. త‌న బాధ‌ను రాష్ట్రానికి ఆపాదించి..ఎక్క‌డా పోరాటాల‌కు దిగ‌డం లేదు. ప్ర‌జ‌లు త‌న‌కు అప్ప‌గించిన అధికారాన్ని సంపూర్ణం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.


అంతేత‌ప్ప‌.. త‌న లోపాల‌ను, త‌నుసాధించ‌లేక పోయిన అంశాల‌ను ప్ర‌జ‌ల‌పైకి నెడుతూ.. దానికి ధ‌ర్మ పోరాటం.. ధ‌ర్మ దీక్ష అంటూ.. ఎక్క‌డా ప్ర‌జ‌లనుమ‌భ్య పెట్టే చ‌ర్య‌ల‌కు కూడా దిగ‌డం లేదు. తాజాగా జ‌గ‌న్ కేంద్రంతో స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు వెళ్లారు. ఈ క్ర‌మంంలోనే హోంమంత్రి, బీజేపీ సార‌థి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే, దీనికి ముందు జ‌రిగిన ప‌రిణామాల‌ను ఓ వ‌ర్గం తెలుగు మీడియా భారీ ఎత్తున ప్ర‌చారం చేసింది. ఇంకేముంది.. జ‌గ‌న్ ప‌డిగాపులు కాసినా.. షా ఆయ‌న‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించ‌లేదు. ఆయ‌న నేర‌స్తుడు కాబ‌ట్టే .. షా ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌లేదు.. అని వండి వార్చింది.


ఇదే మీడియా చంద్ర‌బాబు అదికారంలో ఉన్న స‌మ‌యంలో అదే షాను నేర‌స్తుడిగా చూపించిన సంద‌ర్భా లు మ‌రిచి పోవ‌డం గ‌మ‌నార్హం. సోహ్రాబుద్దీన్ న‌కిలీ ఎన్ కౌంట‌ర్ కేసులో షా పై కేసు గ‌త రెండేళ్ల కింద‌ట కొట్టేసే వ‌రకు(మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చాకే దీనిని కొట్టేశారు) షాను కూడా ఇదే మీడియా నేర‌స్తుడిగా చూపించింది. బాబుకు అప్పాయింట్ మెంట్ ల‌భించ‌క‌.. ఢిల్లీలో కాళ్ల‌ర‌గిలే తిరుగుతున్నార‌ని, ఏపీ ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను వివ‌రించేందుకు ఈ వ‌య‌సులో కూడా ఆయ‌న రోజుల త‌ర‌బ‌డి వెయిట్ చేస్తున్నార‌ని క‌న్నీరు కార్చిన మీడియా తెలుగు దేశం పార్టీ నాయ‌కులు ఇప్పుడు మాత్రం జ‌గ‌న్‌పై ప‌డి ఏడ‌వ‌డం గ‌మ‌నార్హం.


మొత్తానికి జ‌గ‌న్ షా అప్పాయింట్ మెంట్ సాధించారు. దాదాపు 40 నిమిషాల‌కు పైగానే ఆయ‌నతో రాష్ట్ర ప‌రిస్తితిపై చ‌ర్చించారు. అయినా కూడా బాబు కానీ, బాబు అనుకూల మీడియాలో కానీ ఈ విష‌యం హైలెట్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి.. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం... రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం ఉందో అర్ధం కావ‌డం లేదా ? అంటున్నారు ప‌రిశీల‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: