ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి గారు తీవ్రంగా  మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో బస్సు ట్రావెల్స్ ఉన్నా,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం తమను మాత్రమే టార్గెట్ చేశారని  ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు తమకు చెందిన 31 బస్సులను  వారు సీజ్ చేశారని ఆయన పేర్కొన్నారు.తమ  బస్సులనే భూతద్దంలో చూసి మరి  సీజ్ చేస్తున్నారని, దీనిపై తాము  తొందరలో న్యాయపోరాటం చేస్తామని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. 

జరిమానాలతో పోయే తప్పిదాలకు సీజ్‌ చేయడం ఎంతవరకు సబబు అని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి గారు  ప్రశ్నించారు. మరోవైపు జగన్ పాలన చాలా  జనరంజకంగా ఉందని పలు వ్యాఖ్యలు కూడా  జేసీ చేసారు. జగన్ పాలనకు 100కు 150 మార్కులు వేస్తానని చెప్పారు. జగన్ ఎప్పుడైనా తమ వాడేనని స్పష్టం చేశారు.

అయితే, పరిపాలనలో కొన్ని అవకతవకలు ఉంటూనే ఉంటాయి అని,వారు  కిందా మీదా పడుతున్నారని ఎద్దేవా చేశారు. మా బస్సులు సీజ్ చేస్తే,మేము ఒరుకోబోము అని మేం ఏం చేస్తామో మీరే చూస్తారు అని  జగన్‌కు జేసీ కౌంటర్ ఇస్తున్నారు.జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్న కారణంతో ఆర్టీఏ అధికారులు ఇటీవల 23 బస్సులను సీజ్ చేశారు.

దీని పై  స్పందిస్తూ,జగన్ కేవలం తమను మాత్రమే టార్గెట్ చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు తమకు చెందిన 31 బస్సులను కేంద్రం సీజ్ చేశారని చెప్పారు.23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ  కూడా రద్దు చేశారు. జేసీ ట్రావెల్స్ మీద అనేక ఫిర్యాదులు రావడంతో తనిఖీ చేపట్టామని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: